బిగ్‌బాస్ షోలో ఫ్యామిలీ వీక్ కోసం ప్రతిఒక్కరూ ఎదురుచూస్తారు. ఎందుకంటే మిగతా రోజులు ఎంత గొడపడ్డా సరే 'ఫ్యామిలీ వీక్' వచ్చేసరికి హౌస్‌మేట్స్ అందరూ ఒక్కటవుతారు. చూస్తున్నంతసేపు నిజమైన ఎమోషన్స్ బయటకొస్తాయి. అందుకే ప్రేక్షకులు కూడా ప్రతి సీజన్‌లోనూ దీనికోసమే ఎదురుచూస్తుంటారు. ఈసారి 9వ సీజన్‌లో మొదలైపోయింది. ఇప్పటికే తనూజ కుటుంబ సభ్యులు రాగా.. సుమన్ శెట్టి భార్య కూడా హౌస్‌లోకి వచ్చింది. ఈ ప్రోమో చాలా బాగుంది.
తొలుత సుమన్ శెట్టిని కన్ఫెషన్ గదికి పిలిచిన బిగ్‌బాస్.. మీరు పొందిన టైమ్ కార్డ్ ద్వారా మీ కుటుంబ సభ్యునితో 20 నిమిషాలు మాత్రమే గడపగలరు అని చెప్పారు. మరీ ఇంత తక్కువ సమయమేనా అని సుమన్ బాధపడ్డాడు గానీ గార్డెన్ ఏరియాలో ఉన్న తన భార్యని చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. బుగ్గపై ముద్దుపెట్టి మరీ ఎలా ఉన్నావ్ అని క్యూట్‌గా అడిగాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి పూజ.. కుంకుమ పెట్టి ఏడ్చేసిన 'తనూజ')
అలానే అమ్మ ఆరోగ్యం ఎలా ఉందని సుమన్ చాలా బెంగపడుతూ భార్యని అడిగాడు. బాగానే ఉన్నారని చెప్పడంతో.. గౌతమ్ రాలేదేమీ అంటూ తన బిడ్డ గురించి సుమన్ అడిగాడు. ఒక్కరికే పర్మిషన్ ఇచ్చారని చెప్పడంతో ఊరుకున్నాడు. బాగా ఆడుతున్నానా అని తన ఆట గురించి భార్యని స్వీటుగా అడిగాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అని చెప్పిన సుమన్ భార్య.. నీకు ఇష్టమని ఫుడ్ తెచ్చానని చెప్పింది. ఇది ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.
నువ్వు తిను, నువ్వు తిను అంటూ సుమన్, అతడి భార్య ఒకరికి ఒకరు ఆప్యాయంగా తినిపించుకున్నారు. ఇది అయిన తర్వాత గార్డెన్ ఏరియాలో ఇద్దరూ కలిసి చిన్న స్టెప్పులేస్తూ డ్యాన్స్ చేశారు. అదే టైంలో మిగిలిన హౌస్‌మేట్స్ కూడా వీళ్లని ఎంకరేజ్ చేస్తూ సంతోషంగా గంతులేశారు. ప్రోమోనే ఇంత బాగుందంటే.. ఎపిసోడ్ ఇంకెంత బాగుండబోతుందో?
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమా)


