
మరో నాలుగు రోజుల్లో దసరా (అక్టోబర్ 2న విజయదశమి) పండగ రాబోతోంది. కానీ బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో ఈ పండగ ముందే వచ్చేసింది. నేడు దసరా స్పెషల్ ఎపిసోడ్ రానుంది. రాత్రి 7 గంటలకే ఈ ఎపిసోడ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. దేత్తడి హారిక డ్యాన్స్, లిప్సిక సాంగ్, తెలుసు కదా హీరోహీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ, రాఖీ ఖన్నా, శ్రీనిధి శెట్టి.. కె ర్యాంప్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ యుక్తి తరేజా స్పెషల్ ఎంట్రీతో ప్రోమో దద్దరిల్లింది.

నీ గేమ్ నీకోసం ఆడు: రీతూ తల్లి
కోర్ట్ జంట రోషన్-శ్రీదేవి డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఫ్యామిలీ నుంచి లెటర్స్, ఆడియో మెసేజ్ మిస్సయిన హౌస్‌మేట్స్‌కు ఈరోజు బంపరాఫర్ ఇచ్చారు. ముందుగా రీతూ చౌదరికి ఆమె తల్లి పంపిన వాయిస్ మెసేజ్ వినిపించారు. హలో అమ్ములు, నేనిక్కడ బానే ఉన్నాను. నీ గేమ్ నీకోసమే ఆడుకో నాన్న. ఎవరి కోసమో నువ్వు వెళ్లలేదు. నేను దేనిగురించి అంటున్నానో నీకు తెలుసు. కొంచెం అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అంది. తల్లి గొంతు వినగానే రీతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అబ్బాయిలతో గేమ్ పక్కన పెట్టి నీ గేమ్ నువ్వు ఆడు అని రీతూ తల్లి చెప్పకనే చెప్పింది. మరి ఇకనైనా రీతూ మారుతుందా? లేదా? చూడాలి!