
మెగా హీరో రామ్‌చరణ్ సతీమణి, బిజినెస్ ఉమెన్ ఉపాసన (Upasana Konidela) బతుకమ్మ ఆడారు. తెలంగాణ పండుగను దేశరాజధాని ఢిల్లీలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఢిల్లీలోని ఓ కళాశాలలో శనివారం (సెప్టెంబర్ 27న) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సీజన్‌లో నా మొదటి బతుకమ్మను రేఖాగారితో జరుపుకున్నాను అంటూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు.
కాలేజీ స్టూడెంట్స్‌తో బతుకమ్మ
ఇందులో ఉపాసన, రేఖా గుప్త.. కాలేజీ విద్యార్థులతో కలిసి అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఆడారు. పండుగ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న సీఎం రేఖా.. ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బతుకమ్మ అంటే పూల పండగ మాత్రమే కాదు. మాతృత్వం, జీవితం, ప్రకృతిని సెలబ్రేట్ చేసుకోవడం..
మాతో కలిసి బతుకుమ్మ జరుపుకున్నందుకు థాంక్స్
ఢిల్లీలో ఉన్న తెలుగువారు ఈ నగర అభివృద్ధిలోనూ భాగమయ్యారు. తమ సంస్కృతికి కొత్తరంగులు అద్దారు. ఈ పండగ సందర్భంగా.. మనందరం మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని, వాటిని తర్వాతి తరాలకు అందివ్వాలని ప్రతిజ్ఞ చేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ పోస్ట్‌కు ఉపాసన స్పందిస్తూ.. రేఖా గుప్తాగారు మీరు అద్భుతమైన ముఖ్యమంత్రి. తెలంగాణ సంస్కృతిని సెలబ్రేట్ చేస్తూ, బతుకమ్మ పండగను మాతో కలిసి జరుపుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు.
Rekha Gupta ji you are an amazing CM. Thank you for embracing our Telangana culture and celebrating Bathukamma Panduga with us. Jai Hind. 🙏❤️ https://t.co/wY7xGYp9DS
— Upasana Konidela (@upasanakonidela) September 27, 2025

చదవండి: నేనేం తప్పు చేశానని..? డార్క్ రూమ్‌లో కూర్చుని ఏడ్చా: తమన్