
'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో పింకీ గుర్తుందిగా.. ఇప్పుడా పింకీ తల్లి కాబోతోంది. పింకీ అలియాస్ సుదీప (Sudeepa Pinky) గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భర్త శ్రీరంగనాథ్‌తో కలిసి మెటర్నటీ షూట్ చేయించుకోగా.. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నమ్మకం మమ్మల్ని ముందుకు నడిపించింది.. ప్రేమ మమ్మల్ని బలంగా ఉంచింది. ఇప్పుడు మా కుటుంబం పెద్దదవుతోంది అని రాసుకొచ్చింది. అయితే తనకు ఈ మధ్యే డెలివరీ అయిందని, మెటర్నటీ షూట్ ఫోటోలను ఆలస్యంగా పోస్ట్ చేసిందంటున్నారు. మరి తన డెలివరీ గురించి సుదీప క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

2015లో మిస్‌క్యారేజ్
సుదీపకు పెళ్లయి దాదాపు 12 ఏళ్లవుతోంది. 2015లో తొలిసారి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లో వెల్లడించింది. 2015లో ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ, అప్పుడు రెడీగా లేను. అయినా సరే, చూద్దామని ప్రెగ్నెన్సీని అలాగే ఉంచుకున్నాను. కొంతకాలానికి పొట్టలో బిడ్డతో మాట్లాడటం మొదలుపెట్టాను. బేబీ హార్ట్‌బీట్ కూడా బాగానే ఉంది. నాకు థైరాయిడ్ సమస్య ఉండేది. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, థైరాయిడ్ ఎక్కువవడంతో బిడ్డను కోల్పోయాను అని చెప్తూ ఏడ్చేసింది.
సినిమా
1994లో రవిరాజా పిన్నెశెట్టి దర్శకత్వంలో వచ్చిన ధర్మరాజు ఎం.ఏ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పింకీ. మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు వంటి సినిమాల్లో నటించింది. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. ఆ మధ్య తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొంది. అందరినీ కమాండ్ చేస్తూ బాస్ లేడీ అన్న ట్యాగ్ అందుకుంది. ఆరోవారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించనేలేదు.
చదవండి: నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు.. కోపంతో ఊగిపోయిన దివ్య