
బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్, కమెడియన్ రోహిణి (Actress Rohini) ఇటీవల పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. సెప్టెంబర్ 8న ఇంట్లోనే తన బర్త్‌డే వేడుకలు జరుపుకుంది. తాజాగా పుట్టినరోజు నాడు వచ్చిన కానుకల గురించి వెల్లడించింది. తన ఫ్రెండ్స్ ఉంగరం, నెక్లెస్, హ్యాండ్ బ్యాంగ్, చీర వంటి కానుకలను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది.
బంగారు కానుక
తన తల్లి ఊహించని బహుమతిచ్చిందంటూ ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. రోహిణికి తల్లి నాలుగు బంగారు గాజులను గిఫ్ట్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన గాజులను చూసి మురిసిపోయిన నటి తల్లిపై ముద్దుల వర్షం కురిపించింది. మా అమ్మ నాకోసం బంగారు గాజులు కొనిందోచ్ అంటూ యూట్యూబ్‌లో వీడియో షేర్ చేసింది. ఇకమీద ఇవే వేసుకుని తిరుగుతానంది.
సీరియల్స్‌తో మొదలైన జర్నీ
అటు బుల్లితెర షోలలో, ఇటు సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తోంది రోహిణి. సీరియల్స్‌తోనే తన కెరీర్ మొదలైంది. అక్కడినుంచి వెండితెర వరకు తన ప్రయాణాన్ని కొనసాగించింది. మధ్యలో తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి.. తన ఆటతో సివంగిగా గుర్తింపు తెచ్చుకుంది. మత్తు వదలరా, బలగం సినిమాలే కాకుండా సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌తో బాగా పాపులర్ అయింది.
చదవండి: అల్లు అరవింద్ ఏమీ చేయరు, చివర్లో వచ్చి పేరు కొట్టేస్తారు!