సాక్షి, యశవంతపుర: బిగ్‌బాస్ అనగానే వివాదాలు, గొడవలు గుర్తుకువస్తాయి. అదే మాదిరిగా బుల్లితెర నటి, గతంలో బిగ్‌బాస్–8 పోటీదారు దివ్య సురేశ్ హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకుంది. బైక్‌ను ఢీకొనడంతో ఓ యువతి కాలు విరిగినట్లు తెలిసింది. దీంతో, ఆమెను విచారించి కారును సీజ్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల నాలుగో తేదీ అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో బెంగళూరు బ్యాటరాయనపుర ఎంఎం రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కిరణ్, అనుషా, అనిత కలిసి బైకులో ఆస్పత్రికి వెళుతున్నారు. కుక్కలు అడ్డురావటంతో భయంతో కిరణ్ బైకును కొద్దిగా కుడివైపు తిప్పాడు. అదే సమయంలో వెనుక వేగంగా వస్తున్న దివ్య సురేశ్ కారు.. వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కింద పడ్డారు. అనిత కాలికు దెబ్బ తగిలింది. అయినా కూడా దివ్య కారు ఆపి ఏమైందో తెలుసుకోకుండా అలాగే ఉడాయించింది.
రూ.2 లక్షలు ఖర్చయింది
ఈ క్రమంలో కిరణ్ ఏడో తేదీన కారు హిట్ అండ్ రన్‌పై బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం, పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అది దివ్య సురేశ్ కారుగా గుర్తించారు. దీంతో, ఆమెను విచారించి కారును సీజ్ చేశారు. అనిత కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్సగానూ రూ. 2లక్షలు ఖర్చయినట్లు, తమకు న్యాయం చేయాలని కిరణ్ ఫిర్యాదులో కోరాడు.
Weeks after a late-night hit-and-run accident in Bengaluru, the city traffic police on Friday identified ex Bigg Boss Kannada contestant Divya Suresh as the alleged driver of the car involved in the accident that left three people injured. The accident took place near Nithya… pic.twitter.com/ucoigQ6FWn
— Karnataka Portfolio (@karnatakaportf) October 24, 2025


