బిగ్‌బాస్ రియాలిటీ షో మరింత ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ అమర్‌దీప్ చౌదరి. తన అగ్రెసివ్ మాటలతో హౌస్‌లో తన ఆటతో మెప్పించాడు. బుల్లితెరపై అలరించిన అమర్‌దీప్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా చేస్తోన్న చిత్రం సుమతి శతకం. ఈ సినిమాతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీలో సైలీ చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమర్ దీప్ చౌదరి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. టీవీ ఇండస్ట్రీ నుంచి బయటకొచ్చి సినిమాలు చేద్దామని ఎప్పటి నుంచో ఉందని అన్నారు. తన లైఫ్ స్టైల్‌ను మార్చుకుని బతకాల్సి వచ్చిందని తెలిపారు. అన్ని లగ్జరీ వసతులు ఉన్న కారును వదిలిపెట్టి.. నార్మల్ కారు వాడుతున్నానని అమర్ దీప్ వెల్లడించారు. కానీ ఏదో ఒక రోజు మళ్లీ ఆ రోజు వస్తుందని అన్నారు.
తనకు హీరో రవితేజ అంటే చాలా ఇష్టమని అమర్‌దీప్ అన్నారు. ఆయనకు తాను అభిమానినని.. ఇండస్ట్రీలో తనకు ఆదర్శమని తెలిపారు. ఆయనే నాకు గురువు.. రవితేజను చూసే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని వెల్లడించారు. సింధూరం సినిమాలో రవి తేజలో కనిపించిన ఆ స్పార్క్‌ను నేను పట్టుకుని.. అదే స్పార్క్‌ను ఈ సినిమాలో చూపించానని అమర్ దీప్ తెలిపారు.
లగ్జరీ కార్ నుంచి నార్మల్ కార్కు మారినా నేను సంతోషంగానే ఉన్నాను.
మెయింటెనెన్స్ భారం లేకపోవడమే కారణం.
ఏదో ఒక రోజు ఈ రెండింటికీ మించి ఇంకొక్కటి తీసుకోగలను అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను.
- Amardeep Chowdary #SumathiSathakam
Full interview youtube link :… https://t.co/mxoFvqHGz2 pic.twitter.com/9Ti5Wmopbq— idlebrain.com (@idlebraindotcom) January 23, 2026


