బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ ప్రస్తుతం ఆడియన్స్ను అలరిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ షో నడుస్తోంది. బుల్లితెర ప్రియుల్లో అత్యంత ఆదరణ ఈ షో పలువురు నటీనటులు కంటెస్టెంట్స్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది హిందీలో బిగ్బాస్-19వ సీజన్కు చేరుకుంది. ఇందులో ప్రముఖ బుల్లితెర నటుడు అభిషేక్ బజాజ్ కూడా కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టారు.
అయితే బిగ్బాస్లో ఉన్న బుల్లితెర నటుడిపై ఆయన మాజీ భార్య ఆకాంక్ష జిందాల్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. అతని వ్యక్తిగత జీవితంపై సంచలన కామెంట్స్ చేసింది. వైవాహిక జీవితంలో అభిషేక్ తనను మోసం చేశాడని ఆరోపించింది. వాస్తవాలను దాచిపెట్టి.. నటించడంలో అతన్ని మించినవారు లేరని ఆకాంక్ష ఆరోపించింది.
అభిషేక్ బజాజ్ తన వయస్సు, వైవాహిక జీవితం గురించి అబద్ధాలు ఆకాంక్ష జిందాల్ చెబుతున్నాడని తెలిపింది. అంతేకాకుండా అతనికి చాలా మంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయని సంచలన కామెంట్స్ చేసింది. తాము విడాకులు తీసుకోవడానికి అదే కారణమని.. తనతో పాటు ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆకాంక్ష జిందాల్ మాట్లాడుతూ.. “సల్మాన్ సార్ ముందు కూడా అబద్ధం చెప్పడానికి అస్సలు వెనుకాడడు. అతని వయస్సు, వైవాహిక స్థితి గురించి అబద్ధం చెప్పడం ఎప్పుడు అలవాటే. ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో 21 ఏళ్ల వ్యక్తిగా తన చరిత్రను రిపీట్ చేస్తున్నాడు. అతని డిక్షనరీలో సిగ్గు అనే పదానికి చోటు లేదు. ఈ విషయాన్ని నేను ప్రతీకారం కోసం చెప్పడం లేదు. మీరందరూ ఇతర పోటీదారుల గురించి మాట్లాడే విధంగానే నిజం బయటకు రావాలని కోరుకుంటున్నా" అని తెలిపింది.


