Live Updates

బిగ్‌బాస్ 9 తెలుగు.. 'వైల్డ్ కార్డ్' ఎపిసోడ్ హైలైట్స్
శ్రీజ ఎలిమినేట్
సుమన్ శెట్టికి ఇంకా పొటెన్షియల్ ఉందని చెప్పి శ్రీజ బెలూన్ ఆయేషా కట్ చేసింది. సాయి.. గత గేమ్ లో శ్రీజ బాగా ఆడిందని చెబుతూ సుమన్ బెలూన్ కట్ చేశాడు. మాధురి.. ప్రతి విషయంలో మధ్యలో దూరుతోందని శ్రీజ బెలూన్ కట్ చేసింది. గౌరవ్.. సుమన్ బెలూన్ ని కట్ చేశాడు. నిఖిల్.. చాలా సెన్సిటివ్, ఫెయిల్యూర్ తీసుకోలేకపోతున్నారని శ్రీజ బెలూన్ కట్ చేశాడు. రమ్య.. మాట్లాడే విధానం సుమన్ బెటర్ అందుకే శ్రీజ బెలూన్ కట్ చేసింది. అలా ఎక్కువ బెలూన్స్ కట్ అయిన శ్రీజ.. ఐదోవారం డబుల్ ఎలిమినేషన్ అయిపోయింది.

సేఫ్ జోన్‌లోకి వచ్చిన పవన్
చివరగా వచ్చిన ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆయేషా, గౌరవ్ ఆధ్వర్యంలో రెండు స్టేజీల్లో గేమ్ జరగ్గా.. సుమన్ శెట్టి, శ్రీజని ఓడించి పవన్ విజేతగా నిలిచాడు. సేఫ్ జోన్‌లోకి వచ్చాడు. సుమన్, శ్రీజ డేంజర్ జోన్ లో ఉన్నారు.
ఆరో వైల్డ్ కార్డ్‌గా గౌరవ్ గుప్తా
బిగ్‌బాస్ 9 హౌసులోకి ఆరో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నటుడు గౌరవ్ గుప్తా ఎంటర్ అయ్యాడు. 'గీత ఎల్ఎల్‌బీ' అనే సీరియల్‌తో ప్రేక్షకులకు పరిచయమే. అలానే బ్లూ స్టోన్ ఇచ్చిన నాగ్.. ఇది బిగ్ బ్లెస్సింగ్ పవర్ అని, ఎక్కడో తప్పు చేస్తున్నానని అనిపిస్తే బిగ్‌బాస్‌ని సలహా అడగొచ్చని క్లారిటీ ఇచ్చాడు. అలానే నలుగురి ఫొటోలు చూపి ఎవరో ఒకరిది సెలెక్ట్ చేసుకోమని చెప్పగా తనూజ పేరు చెప్పాడు. ఆ ఫొటో 50 నంబర్ ఉండటంతో అన్ని పుష్ అప్స్ తీయాలని నాగ్ చెప్పాడు. దీంతో స్టేజీపైనే చెప్పినన్నీ తీశాడు. ఇతడికి తెలుగు నేర్పించమని దివ్యకు చెప్పారు. వచ్చే వారం వచ్చేసరికి ఎంత తెలుగు నేర్పించారో చూస్తానని నాగ్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

ఐదో వైల్డ్ కార్డ్‌గా ఆయేషా జీనత్
గతంలో తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న ఆయేషా.. ఐదో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌసులోకి వచ్చింది. గతంలో తమిళ షోలో 65 రోజుల పాటు ఉన్నానని కానీ బయట తన ప్రియుడు వేరే అమ్మాయితో రిలేషన్ మెంటైన్ చేశాడని చెప్పుకొచ్చింది. తెలుగులో ఈమె 'సావిత్రి గారి అబ్బాయి' సీరియల్‌తో పాపులర్. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ రెండో సీజన్‌లోనూ పాల్గొంది. ఈమెకు గ్రీన్ స్టోన్ ఇచ్చారు. నామినేషన్స్ లో ఈ పవర్ ఉపయోగించి, జరిగే తీరుని మార్చొచ్చు. ఎలా ఉపయోగించొచ్చు అనేది బిగ్ బాస్ చెప్తాడని నాగ్ క్లారిటీ ఇచ్చారు. అలానే హార్ట్ సింబల్ ఇచ్చి.. హౌసులోని ఎవరికైనా ఇచ్చి, కారణం కూడా చెప్పాలని పేర్కొన్నారు. దీంతో ఇమ్మాన్యుయేల్‌కి హార్ట్ సింబల్ ఇచ్చేసింది.

క్యాచ్ ద స్టిక్.. విజేతగా రీతూ
'క్యాచ్ ద స్టిక్' పేరుతో ఓ గేమ్ పెట్టి, డేంజర్ జోన్‌లో ఉన్న నలుగురికి పోటీ పెట్టారు. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన మాధురి, నిఖిల్ సంచాలకులిగా వ్యవహరించారు. ఈ గేమ్‌లో సుమన్ తొలుత ఔట్ అయ్యాడు. పవన్ రెండో ధపాలో ఔట్ అయ్యాడు. శ్రీజ మూడో ధపాలో ఔట్ అయింది. విజేతగా నిలిచిన రీతూ.. సేస్ జోన్‌లోకి వెళ్లిపోయింది. అలా రీతూకి గోల్డెన్ స్టార్ స్టిక్ చేశారు.
నాలుగో వైల్డ్ కార్డ్‌గా నిఖిల్ నాయర్
పుట్టింది కేరళలో సెటిలైంది బెంగళూరులో. సీరియల్స్ చేస్తుంది తెలుగులో. నా కెరీర్ ని ప్రారంభించింది ఇక్కడే కాబట్టి రుణం తీర్చుకుంటాను అని నిఖిల్ అనగానే.. మరి ఇక్కడమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని నాగ్ అడగ్గా.. కచ్చితంగా చేసుకుంటానని చెప్పాడు. హౌస్ మొత్తంలో ఇమ్మాన్యుయేల్ నచ్చాడని చెప్పుకొచ్చాడు. పింక్ స్టోన్.. కెప్టెన్సీ కోసం చాలా టాస్కులు జరుగుతుంటాయి. దీన్ని ఉపయోగించి కెప్టెన్సీ కంటెంటర్ అయిపోవచ్చు అని నాగ్ పేర్కొన్నారు. హౌసులో ఇప్పటికే ఉన్న కెప్టెన్(కల్యాణ్)ని నమ్మించి, అతడి కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసి స్టోర్ రూంలో పెట్టించాలని చెప్పి నాగ్ టాస్క్ ఇచ్చారు.
మూడో వైల్డ్ కార్డ్‌గా మాధురి
'ఆకాశంలో ఆశల హరివిల్లు' అనే పాటతో మూడో వైల్డ్ కార్డ్‌గా దివ్వల మాధురి వచ్చింది. ఇంటర్మీడియట్ లో ఉండగానే నాకు పెళ్లయిపోయింది. తర్వాత మూడు ఆడపిల్లలు పుట్టారు. కానీ మొదటి నుంచి భర్తతో అండర్ స్టాండింగ్ తక్కువ. చాలా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను కానీ కుదర్లేదు. దీంతో విడిపోయాను. గత నాలుగేళ్ల నుంచి మాత్రం శ్రీనివాస్ అంటే మాధురి, మాధురి అంటే శ్రీనివాస్‌గా బతుకుతున్నాం. ప్రతిరోజూ సోషల్ మీడియాలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నా కూతుళ్లని ట్రోల్ చేస్తున్నారు. జీవితంలో చాలా నెగిటివిటీని చూశాను, సొసైటీ మొత్తం ఒకవైపు, నేను ఒకవైపు అన్నట్లు సాగింది. మిగిలిన వాళ్లు కూడా నా గురించి తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే బిగ్‌బాస్‌లోకి వస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇమ్మాన్యుయేల్ బెస్ట్, మిగిలిన వాళ్లందరూ మాస్క్‌లు పెట్టుకుని ఉంటున్నారు. అలానే మాధురికి గోల్డెన్ బజర్ పవర్ స్టోన్ ఇచ్చారు. ఇది ఉపయోగించి ఓ ఎలిమినేషన్‌ని రద్దు చేసే అవకాశముంది అని నాగార్జున చెప్పాడు.

స్టిక్ ఇట్ టూ విన్ ఇట్.. సేవ్ అయిన సంజన
బ్లాక్ స్టార్ ఉన్న శ్రీజ, పవన్, రీతూ, సంజన, సుమన్ శెట్టి.. గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చి వాళ్లతో 'స్టిక్ ఇట్ టూ విన్ ఇట్' అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా వైల్డ్ కార్డ్స్‌గా వచ్చిన సాయి, రమ్య.. వీళ్లకు నచ్చిన కొన్ని వస్తువులని ఐదుగురు ఇస్తారు. వాళ్ల వెనకున్న బోర్డుపై వాటిపై అతికించాల్సి ఉంటుంది. సుమన్ శెట్టి 5, పవన్ 10, సంజన 10, రీతూ 5, శ్రీజ 8 వస్తువుల్ని అతికించారు. వీళ్లిద్దరిలో ఒకరిని సేవ్ చేయాలి అని చెప్పగా.. సంజన పేరు చెప్పారు. దీంతో ఆమె సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో సంజనకు గోల్డెన్ స్టార్ ఇచ్చేశారు.
రెండో వైల్డ్ కార్డ్‌గా శ్రీనివాస్ సాయి
బిగ్‌బాస్ 9లోకి రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా శ్రీనివాస్ సాయి ఎంట్రీ ఇచ్చాడు. 'గోల్కోండ స్కూల్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. తర్వాత కాలంలో హీరోగా పలు చిత్రాలు చేశాడు. ఏం చేయగలుగుతానో అది 100 శాతం చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. డార్క్ బ్లూ స్టోన్.. అంటే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. నామినేషన్ల సమయంలో ఈ స్టోన్ ఉపయోగించొచ్చు. కానీ ఎప్పుడు ఉపయోగించాలి అనేది బిగ్ బాస్ చెప్తాడు అని నాగ్ క్లారిటీ ఇచ్చారు.
తొలి వైల్డ్ కార్డ్‌గా రమ్య మోక్ష
పికెల్స్ పాపగా ఫేమ్ తెచ్చుకున్న రమ్య మోక్ష.. బిగ్‌బాస్ 9లోకి తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటికైనా జంతువుల కోసం షెల్టర్ హోమ్ ఏర్పాటు చేసి, దాన్ని అమల గారితో ఓపెన్ చేయించాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చింది. రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్సో తాను అంతే ఫేమస్ అని చెప్పుకొచ్చింది. తొలుత ఫిట్‌నెస్ వీడియోలతో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నానని, తర్వాత అక్కలతో కలిసి పికెల్స్ బిజినెస్ ప్రారంభించానని చెప్పుకొచ్చింది.
ఓ రోజు షూటింగ్ కోసం కొడైకెనాల్ వెళ్తే.. ఉదయానికల్లా నాన్న చనిపోయారనే వార్త తెలిసింది. దీంతో త్వరగా ఇంటికొచ్చినా 2 నిమిషాలు మాత్రమే తండ్రిని చూసుకోగలిగానని రమ్య చెప్పుకొచ్చింది. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి వెళ్లడం ఆనందంగా ఉందని తెలిపింది. హౌస్‌లో ఎంటర్ టైన్‌మెంట్ అనేది లేదని, తాను వెళ్లి కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తానని చెప్పుకొచ్చింది. హౌసులో తనకు నచ్చిన కంటెస్టెంట్ ఒక్కరూ లేరని, నచ్చని కంటెస్టెంట్ మాత్రం భరణి అని చెప్పింది. అలా లగ్జరీ ఫుడ్ అనే అవకాశం ఇస్తున్నట్లు హోస్ట్ నాగార్జున చెప్పుకొచ్చాడు. అలానే హౌస్‌లోని ఐదుగురికి రకరకాల పచ్చడి ఇవ్వాలని టాస్క్ ఇవ్వగా... ఓవరాక్టింగ్ పచ్చడి (శ్రీజ), సెల్ఫీష్ పచ్చడి (పవన్), సేఫ్ గేమ్ పచ్చడి (భరణి), ఫేక్ పచ్చడి (దివ్య), మ్యానిప్యులేటర్ పచ్చడి (రాము రాథోడ్) ఇచ్చింది.

ఫ్లోరా ఎలిమినేట్
లక్స్ పాప ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అయింది. గత నాలుగు వారాలుగా శ్రష్ఠి వర్మ, మనీష్, ప్రియ, హరీశ్.. హౌస్ నుంచి బయటకు రాగా ఐదోవారం ఫ్లోరా ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చింది. రీతూతో పాటు ఈమె కూడా ఎవిక్షన్ రూంలో ఉండగా.. ఫ్లోరా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇక వెళ్తూవెళ్తూ సంజన, దివ్య, ఇమ్మాన్యుయేల్, శ్రీజకి థమ్ అప్ ఇచ్చింది. భరణి, తనూజకి థమ్స్ డౌన్ ఇచ్చింది. సుమన్ శెట్టిని మాత్రం అటుఇటుకి మధ్యలో పెట్టింది.

వాళ్లని మిస్ అవుతాం
హౌస్‌లో ఎవరిని మిస్ అవుతున్నారని హోస్ట్ నాగార్జున అడగ్గా.. ఫ్లోరా సంజన పేరు చెప్పింది. రీతూ.. పవన్ పేరు చెప్పింది. ఒకవేళ బయటకు వెళ్తే నిన్ను చాలా చాలా మిస్ అవుతానని చెబుతూ రీతూ ఏడ్చేసింది. తనూజ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పుకొచ్చింది.
ఎవిక్షన్ గదిలోకి రీతూ-ఫ్లోరా
గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని చెప్పాడు. అలానే డేంజర్ జోన్‌లో ఉన్న రీతూ, ఫ్లోరాని ఎవిక్షన్ గదికి రమ్మని చెప్పాడు. దీంతో భయంతో రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌మేట్స్ అభిప్రాయన్ని నాగ్ అడగ్గా.. దాదాపు అందరూ ఫ్లోరా ఎలిమినేట్ అవుతుందని చెప్పుకొచ్చారు.
హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ
బిగ్‌బాస్ 9వ సీజన్‌లో అప్పుడే ఐదు వారాలు గడిచిపోయింది. ప్రతిసారిలానే ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. ఏకంగా ఆరుగురు హౌస్‌లోకి కొత్తగా అడుగుపెట్టబోతున్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఆదివారం ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందనేది లైవ్ అప్‌డేట్స్‌లో చూద్దాం.