బిగ్‌బాస్‌ కోసం కీలక నేత సాయం.. కిచ్చా సుదీప్‌ కృతజ్ఞతలు | Actor Kichcha Sudeepa Thanks DK Shivakumar For Order To Lift Seal On Bigg Boss, Chek Tweets Inside | Sakshi
Sakshi News home page

కన్నడ బిగ్‌బాస్‌ కోసం కీలక నేత సాయం.. కిచ్చా సుదీప్‌ కృతజ్ఞతలు

Oct 9 2025 10:50 AM | Updated on Oct 9 2025 12:10 PM

Actor Kichcha Sudeepa thanks DK Shivakumar for order to lift seal on Bigg Boss

బిగ్‌బాస్‌  సీజన్‌-12 కన్నడ రియాలిటీ షో ప్రారంభమైన కొద్దిరోజులకే ఆపేయాలంటూ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) నోటీసు జారీ చేసింది. ఆపై హౌస్‌కు తాళాలు కూడా వేసింది. అయితే, మళ్లీ డోర్స్‌ ఓపెన్‌ కానున్నాయంటూ హౌస్ట్‌, నటుడు కిచ్చా సుదీప్‌ ఒక పోస్ట్‌ చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా పర్యావరణం దెబ్బతినేలా షో నిర్వాహుకులు వ్యవహరిస్తున్నారంటూ కాలుష్య నియంత్రణ మండలి పేర్కొన్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ ఇంటికి తాళాలు వేయడంతో లోపల ఉన్న కంటెస్టెంట్లు బయటకు కూడా వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ వారు రీఎంట్రీ ఇవ్వనున్నారు.

రంగంలోకి ఉపముఖ్యమంత్రి 
కన్నడ బిగ్‌బాస్‌ను రక్షించేందుకు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌  ఎంట్రీ ఇచ్చారు. ఈమేరకు ఆయన ఒక ట్వీట్‌ చేశారు. బిగ్‌బాస్‌ హౌస్‌కు వేసిన సీల్‌ను తొలగించాలని బెంగళూరు సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించానని డిప్యూటీ సీఎం తెలిపారు. అయితే, పర్యావరణ శాఖ నుంచి అనుమతి అత్యంత ప్రాధాన్యత ఉందని ఆయన చెప్పారు. కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా బిగ్‌బాస్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి స్టూడియోకు కొంత సమయం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల తమ బాధ్యతను నిలబెట్టుకుంటూనే కన్నడ వినోద పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి తాను కట్టుబడి ఉన్నానని డీకే శివకుమార్‌ చెప్పారు.

బిగ్ బాస్ కన్నడ స్టూడియోపై సీల్ ఎత్తివేయాలని ఆదేశించినందుకు  డీకె శివకుమార్‌కు కిచ్చా సుదీప్‌ కృతజ్ఞతలు తెలిపారు. శివకుమార్‌ సార్‌ సకాలంలో తమకు మద్దతు ఇచ్చినందుకు  హృదయపూర్వక ధన్యవాదాలంటూ సుదీప్‌ పేర్కొన్నారు. ఇటీవలి జరిగిన గందరగోళంలో కన్నడ బిగ్‌బాస్‌ యూనిట్‌ ప్రమేయం లేదని  అంగీకరించినందుకు సంబంధిత అధికారులకు కూడా ధన్యవాదాలంటూ ఆయన తెలిపారు. తాను కోరిన వెంటనే డిప్యూటీ సీఎం స్పందించినందుకు నిజంగా అభినందిస్తున్నానని సుదీప్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement