బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పేరు ఇటీవల తెగ వినిపిస్తోంది. ఆయనపై పాకిస్తాన్ ఉగ్రవాద ముద్ర వేయడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. సౌదీ అరేబి యాలోని రియాద్‌లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించారు. దీంతో పాక్ తన వక్రబుద్ధిని చూపుతూ సల్మాన్పై టెర్రిరిస్ట్ ముద్ర వేసింది.
ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ బిగ్బాస్ రియాలిటీ షో సీజన్-19కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అత్యంత భద్రతా వలయంలో ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. అయితే గతంలో సల్మాన్ రెమ్యునరేషన్‌పై పెద్దఎత్తున రూమర్స్ వినిపించాయి. ఈ షో కోసం ఏకంగా రూ.200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి.
(ఇది చదవండి: సల్మాన్‌పై పాక్ ఉగ్ర ముద్ర)
తాజాగా ఈ వార్తలపై బిగ్బాస్ రియాలిటీ షో నిర్మాత రిషి నెగి రియాక్ట్ అయ్యారు. ఆయనకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా.. అందుకు అర్హుడని అన్నారు. ఆయనకు జియో హాట్స్టార్తో ఉన్న ఒప్పంద ప్రకారమే పారితోషికం ఉంటుందని తెలిపారు. అయితే అది ఎంత అనేది మాత్రం తాను చెప్పలేనన్నారు. కాగా.. సల్మాన్ ఖాన్.. బిగ్బాస్ హోస్ట్గా రూ.150 నుంచి రూ.200 కోట్లు తీసుకున్నారంటూ రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.


