
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9).. ఈసారి చదరంగం కాదు రణరంగమే! అని నాగార్జున చెప్తూనే ఉన్నాడు. దాన్ని కంటెస్టెంట్లు ఎలా అర్థం చేసుకున్నారో కానీ.. హౌస్‌లో తెలివిగా పావులు కదపడానికి బదులు గొడవలు, కొట్లాటలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కలిసి మాట్లాడుకుంటే అయిపోయేదాన్ని కూడా కయ్యంగా మారుస్తున్నారు. విభేదాలు వచ్చినప్పుడయితే హౌస్ అగ్నిగోళంలా మండిపోతోంది. అది చూస్తున్న జనాలకు సైతం పిచ్చెక్కుతోంది.
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్
ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేస్తున్నారేంట్రా? అని జనం కంటెస్టెంట్లను ముఖ్యంగా కామనర్లను తిట్టుకుంటున్నారు. ఇకపోతే ఈ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. వరుసగా ఏడోసారి నాగార్జునే (Nagarjuna Akkineni) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎప్పుడూ సెలబ్రిటీలనే తీసుకునే బిగ్‌బాస్ ఈసారి కామనర్లపైనా ఓ కన్నేశాడు. సెలబ్రిటీలను తొమ్మిది మందిని, అగ్నిపరీక్ష ద్వారా ఆరుగురు కామనర్లను హౌస్‌లోకి పంపించాడు.
పర్వాలేదనిపించేలా టీఆర్పీ
ఈసారి డబల్ హౌస్ అంటూ ఊరించడం, కామనర్ల రాకకోసం స్పెషల్‌గా అగ్నిపరీక్ష పెట్టడంతో షోపై మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో బిగ్‌బాస్ 9 లాంచింగ్ ఎపిసోడ్ దద్దరిల్లిపోతుందనుకున్నారంతా.. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అత్యంత దారుణమైన టీఆర్పీ వచ్చింది. ఈసారి 13.7 రేటింగ్ వచ్చినట్లు స్వయంగా నాగార్జునే వెల్లడించాడు. అలాగే లాంచింగ్ ఎపిసోడ్‌ను 5.9 బిలియన్ మినిట్స్ (590 కోట్ల నిమిషాలు) వీక్షించారని తెలిపాడు. కానీ ఇవి గతంలో వచ్చిన రికార్డులకంటే ఎక్కువేం కాదు!
ఇప్పటివరకు అదే అత్యధికం
జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. నాని హోస్టింగ్ చేసిన రెండో సీజన్‌కు 15.05 వచ్చింది. మూడో సీజన్ నుంచి నాగార్జునే బిగ్‌బాస్ బాధ్యతలు భుజానెత్తుకున్నాడు. అలా మూడో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 17.92, నాలుగో సీజన్‌కు 18.50, ఐదో సీజన్‌కు 18, ఆరో సీజన్‌కు 8.86, ఏడో సీజన్‌కు 18.1, ఎనిమిదో సీజన్‌కు 18.9 రేటింగ్ వచ్చింది. ఈసారి (Bigg Boss 9) ఏడో సీజన్ మినహా మిగతా అన్ని సీజన్లకంటే తక్కువగా 13.7 మాత్రమే వచ్చింది.
5.9 Billion viewing minutes 💫 breaking all the records in the country. Your undisputed love proves once again that BiggBoss stands unmatched ❤️
This is only for the opening act...the drama,thrill and unforgettable moments are just getting started!
And on Television… pic.twitter.com/ivWM6NsdTv— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 18, 2025
చదవండి: కెప్టెన్‌గా డిమాన్ పవన్.. దగ్గరుండి గెలిపించిన రీతూ చౌదరి