breaking news
ticket sale
-
హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?
'అఖండ 2' సినిమాకు తొలిరోజే హైదరాబాద్‌లో 3 కోట్ల టికెట్స్ సేల్ అయ్యాయా? సోషల్ మీడియాలో ఈ మూవీ టికెట్స్, కలెక్షన్స్ గురించి కొందరు చెబుతున్న మాటలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఓ యూట్యూబ్ జర్నలిస్ట్, గురువారం సాయంత్రం మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ఒక్క హైదరాబాద్‌లోనే తొలిరోజు ఏకంగా 3 కోట్ల టికెట్స్ బుక్ అయ్యాయని చెప్పింది. చెబుతున్నది అతి అయినప్పటికీ ఏ మాత్రం తడబడకుండా చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతోంది.(ఇదీ చదవండి: కోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్కలేదా?.. 'అఖండ 2' టీమ్ పై హైకోర్ట్ ఆగ్రహం)హైదరాబాద్ ప్రస్తుత జనాభా దాదాపు కోటి 20 లక్షలు. అందరూ సినిమా చూసినా సరే 3 కోట్ల టికెట్స్ సేల్ కావుగా? ఈమె మాత్రం తొలిరోజే కోట్లాది టికెట్స్ విక్రయించేశారని చెబుతోంది. సరే జనాభా విషయం కాసేపు పక్కనబెడదాం. హైదరాబాద్‌లో దాదాపు 241 థియేటర్లు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ 120 వరకు ఉండగా వీటిలో సుమారు 1.2 లక్షల సీట్లు ఉన్నాయి. మల్టీఫెక్స్‌లు దాదాపు 120 వరకు ఉండగా వీటిలో 2.2-2.5 లక్షల సీట్లు ఉన్నాయి. అంటే సిటీలో మొత్తంగా చూసుకున్నా అన్ని థియేటర్లలో మూడున్నర నుంచి నాలుగు లక్షల సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాబోయే పదిరోజులకు కలిపి టికెట్స్ సేల్ చేసినా సరే 40 లక్షల కంటే దాటవు. అలాంటిది 3 కోట్ల టికెట్స్ అనడం అతికే పరాకాష్ట!'అఖండ 2' సినిమా ఎలాగైతేనేం థియేటర్లలోకి వచ్చేసింది. లెక్క ప్రకారం గతవారమే విడుదల కావాలి. కానీ నిర్మాతలు అప్పుడెప్పుడో చేసిన అప్పుల కారణంగా కోర్టుల చుట్టూ మూడు నాలుగు రోజులు తిరిగి, అంతా సెటిల్ చేసుకుని ఇప్పుడు రిలీజ్ చేశారు. గురువారం సాయంత్రం ప్రీమియర్లతో షోలు పడ్డాయి. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షోలు వేశారు. సినిమా ఫలితం గురించి చెప్పుకొంటే అభిమానులకు మాత్రమే నచ్చగా.. మిగతా వాళ్లకు కనీసం అంటే కనీసం నచ్చట్లేదు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ‘అఖండ 2: తాండవం’ సినిమా రివ్యూ) -
అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!
పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌లైన్ 'ఫ్లాష్ సేల్' ఆఫర్ల కింద కేవలం రూ. 1606 ప్రారంభ ధరతో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.దీని ద్వారా ప్రయాణికులు దేశంలోని ప్రధాన నగరాల మధ్య తక్కువ ధరలో ప్రయాణించే అవకాశం ఉంది. గౌహతి-అగర్తలా, కొచ్చి-బెంగళూరు, చెన్నై-బెంగళూరు, విజయవాడ-హైదరాబాద్ వంటి ప్రముఖ మార్గాలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.ఫ్లాష్ సేల్ కింద బుకింగ్ 27 అక్టోబర్ 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణ తేదీలు నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు ఉంటాయి. కొత్త గమ్యస్థానంలో పండుగను ఆస్వాదించాలనుకునే ప్రయాణీకులకు ఇది గొప్ప అవకాశం.ఇతర ఆఫర్లుఫ్లాష్ సేల్‌తో పాటు ఎయిర్‌లైన్ ఎక్స్‌ప్రెస్ లైట్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. దీనిలో విమాన టిక్కెట్లను బుకింగ్ చేయడానికి ప్రారంభ ధర కేవలం రూ.1456. దీని కింద ప్రయాణికులకు అందనంగా జీరో కన్వీనెన్స్ ఫీజు ప్రయోజనం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్ లైట్ అదనపు 3 కిలోల క్యాబిన్ సామాను ఉచిత ప్రీ-బుకింగ్, చెక్-ఇన్ బ్యాగేజీ ధరలపై తగ్గింపు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే లాయల్టీ సభ్యులు 50% తగ్గింపు రుసుముతోనే బిజినెస్ సీట్లకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 'గౌర్మెట్' హాట్ మీల్స్, సీట్లపై 25% తగ్గింపు, ఎక్స్‌ప్రెస్ ఎహెడ్ ప్రాధాన్యతా సేవలను కూడా పొందవచ్చు. అలాగే విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సిబ్బంది ఎయిర్‌లైన్ వెబ్సైట్లో ప్రత్యేక తగ్గింపుతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
ఆన్లైన్లో భద్రాచల కల్యాణ టికెట్లు
భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 5, 6 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం మహోత్సవాలకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆన్లైన్లో సోమవారం నుంచి సిద్ధంగా ఉంచినట్లు ఆలయ ఈవో రమేశ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రూ.5వేలు, రూ.2వేలు, రూ.1,116, రూ.500, రూ.200, రూ.100 విలువ గల టికెట్లు, మహా పట్టాభిషేకానికి రూ.250, రూ.100 టికెట్లు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయా టికెట్లు www. bhadrachalam online.com ద్వారా పొందవచ్చని తెలిపారు. వివరాలకు 08743–232428 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.


