ఆన్‌లైన్‌లో భద్రాచల కల్యాణ టికెట్లు | badrachalam temple tickets in online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో భద్రాచల కల్యాణ టికెట్లు

Mar 14 2017 4:43 AM | Updated on Sep 5 2017 5:59 AM

ఆన్‌లైన్‌లో భద్రాచల కల్యాణ టికెట్లు

ఆన్‌లైన్‌లో భద్రాచల కల్యాణ టికెట్లు

ఏప్రిల్‌ 5, 6 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం మహోత్సవాలకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో.

భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 5, 6 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం మహోత్సవాలకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆన్‌లైన్‌లో సోమవారం నుంచి సిద్ధంగా ఉంచినట్లు ఆలయ ఈవో రమేశ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రూ.5వేలు, రూ.2వేలు, రూ.1,116, రూ.500, రూ.200, రూ.100 విలువ గల టికెట్లు, మహా పట్టాభిషేకానికి రూ.250, రూ.100 టికెట్లు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయా టికెట్లు www. bhadrachalam online.com ద్వారా పొందవచ్చని తెలిపారు. వివరాలకు 08743–232428 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement