ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. లేదా? ఇలా చెక్ చేసుకోండి | How to Check Your Name in the Voter List Online | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. లేదా? ఇలా చెక్ చేసుకోండి

Oct 17 2026 2:20 PM | Updated on Oct 17 2026 3:00 PM

How to Check Your Name in the Voter List Online

ఓటు వేయడం ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు. లోక్‌సభ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా ఓటు వేయాలంటే ఓటరు జాబితాలో మీ పేరు ఉండాలి. ఓటర్ ఐడీ కార్డు చేతిలో ఉందంటే సరిపోదు. ప్రస్తుత ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా తప్పకుండా నిర్ధారించుకోవాలి.

ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ.. కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో.. మీ పేరు ఓటరు జాబితాలో ఉందో.. లేదో.. ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఇందుకోసం ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు. ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఎస్ఎమ్ఎస్ ద్వారా చెక్ చేసుకోవడం ఎలా?
➤మీ మొబైల్‌లో SMS యాప్‌ను ఓపెన్ చేయండి.
➤ECI <Space> EPIC Number అని టైప్ చేయండి. ఇక్కడ EPIC Number అంటే మీ ఓటర్ ఐడీ కార్డు నంబర్.
➤ఈ SMS‌ను 1950 నంబర్‌కు పంపించండి.
➤మీ ఓటరు వివరాలకు సంబంధించిన సమాధానం వస్తే.. అందులో మీ పేరు, ఓటర్ ఐడీ నంబర్, నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ ➤వంటి వివరాలను పరిశీలించండి.
➤వివరాలు రాకపోతే, మీ బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)ను సంప్రదించండి.

వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవడం ఎలా?
➤ముందుగా ఎలక్టోరల్ సెర్చ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
➤ఇక్కడ ఎపిక్ నంబర్ (ఓటర్ ఐడీ) ఎంటర్ చేయండి.
➤స్టేట్ దగ్గర.. మీ స్టేట్ (రాష్ట్రం) ఎంచుకోండి.
➤చివరగా కనిపించే క్యాప్చా కోడ్‌ను టైప్ చేయండి.
➤మీ వివరాలు కనిపిస్తే మీ పేరు, నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వంటి వివరాలను పరిశీలించండి.

ఓటరు జాబితాలో పేరు కనిపించకపోతే ఏం చేయాలి?
మీ వివరాలు వెతికినా ఫలితాలు కనిపించకపోతే.. మీ ప్రాంతంలోని బూత్ లెవల్ ఆఫీసర్‌ (BLO)ను సంప్రదించండి. అవసరమైతే ఓటరు హెల్ప్‌లైన్ నంబర్ 1950 ద్వారా కూడా సమాచారం పొందవచ్చు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే, కొత్తగా నమోదు చేసుకోవడానికి లేదా వివరాల్లో మార్పులు చేయడానికి ఎన్నికల సంఘం సూచించిన అధికారిక విధానాన్ని అనుసరించండి.

ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన 5 డబ్బు సమస్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement