టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కడికెళ్లినా ఫోటోలను షేర్ చేస్తోంది.
ఇటీవల సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా తిరుమలను సందర్శించిన ఫోటోలు, వీడియోలను సుప్రీత మరోసారి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో తన తల్లితో కలిసి మొకాళ్లపై తిరుమల కొండను ఎక్కుతున్న వీడియోను కూడా పంచుకుంది. ఇది చూసిన అభిమానులు తల్లీకూతుళ్ల దైవభక్తికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


