హెబ్బా పటేల్ రొమాంటిక్ థ్రిల్లర్‌.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Hebah Patel romantic action Theriller ott release date announced | Sakshi
Sakshi News home page

Hebah Patel: హెబ్బా పటేల్ రొమాంటిక్ థ్రిల్లర్‌.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Jan 21 2026 5:10 PM | Updated on Jan 21 2026 5:18 PM

Hebah Patel romantic action Theriller ott release date announced

హెబ్బా పటేల్, అనిరుధ్ శ్రీవాత్సవ్‌ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మారియో. ఈ చిత్రాన్ని కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో తెరకెక్కించారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రం.. గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. కాగా.. నాటకం, తీస్ మార్ ఖాన్ లాంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ ఆడియన్స్‌ను మెప్పించారు. 

తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు హెబ్బా పటేల్‌ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా.. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతమందించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement