నైట్ డ్రెస్‌లో నన్ను చూడాలని అన్నాడు: ఐశ్వర్య రాజేశ్ | Aishwarya Rajesh Shares His horrific experience In recent interview | Sakshi
Sakshi News home page

Aishwarya Rajesh: నైట్ డ్రెస్‌లో నన్ను చూడాలని అన్నాడు: ఐశ్వర్య రాజేశ్

Jan 30 2026 4:47 PM | Updated on Jan 30 2026 5:39 PM

Aishwarya Rajesh Shares His horrific experience In recent interview

సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టేసిన కోలీవుడ్ భామ ఐశ్వర్య రాజేశ్. గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో విక్టరీ వెంకేటేశ్ హీరోగా నటించారు. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా మెప్పించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

అయితే ఈ మూవీతో టాలీవుడ్‌లోనూ ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఐశ్వర్య ఆసక్తికర కామెంట్ల్ చేసింది. ప్రతి ఒక్క అమ్మాయి ఏదొక టైమ్‌లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఉంటారని తెలిపింది. నైట్ అమ్మాయిలు కొంచెం సెక్సీగా ఉండే దుస్తులు వేసుకుంటారు కదా.. నువ్వు ‍‍అలాగే వేసుకుంటే 'ఐ వాంట్ సీ యువర్ బాడీ'అని నాతో అన్నారని గుర్తు చేసుకుంది. అది చూసి ఇలా ఎంతమంది అమ్మాయిలని చేసుంటారని నాకు అనిపించిందని ఐశ్వర్య రాజేశ్ వెల్లడించింది. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయం మాత్రం వెల్లడించలేదు. అంతేకాకుండా మా నాన్న గారు నా చిన్నప్పుడే చనిపోయారంటూ ఎమోషనలైంది.  డ్రెస్‌ల విషయంలో మనం సందర్భానికి తగినట్లుగా వేసుకోవడం మంచిదని ఐశ్వర్య రాజేశ్ అన్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement