
టాలీవుడ్ నటి అనసూయ దీపావళి వైబ్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. పండుగను సెలబ్రేట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఇంట్లో నా సోదరీమణులతో కలిసి ఎంతో ఉత్సాహంగా దీపావళిని జరుకునేదాన్ని అని పోస్ట్ చేసింది. కానీ ఇప్పుడేమే ఒక భార్యగా, తల్లిగా.. నేను అన్నింటినీ చాలా భిన్నంగా చూస్తున్నట్లు అనసూయ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
అనసూయ ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా చిన్నప్పుడు దీపావళి కోసం ఏడాది పొడవునా నా కళ్లు ఎదురు చూసేవి. ఆ రోజుల్లో తెల్లవారుజామునే మంగళారతి.. పాపాజీ ఆశీస్సులు ఇచ్చే ఆ మధురమైన క్షణం.. అలాగే పాకెట్ మనీ.. నేను, నా సోదరీమణులు దాని కోసం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఎదురు చూసేవాళ్లం. ఇంట్లో తయారుచేసిన స్వీట్ల వాసనతో ఆనందంతో నిండిపోయేది. కొత్త బట్టలు.. రంగురంగుల రంగోలి.. ఇంటిని వెలిగించే దీపాల వరుసలు.. క్రాకర్స్, చిచ్చుబుడ్డీలు, ఉల్లిపాయ బాంబులతో సంతోషంగా జరుపుకునేవాళ్లం. కానీ నేడు.. ఒక భార్యగా, తల్లిగా అన్నింటినీ చాలా భిన్నంగా చూస్తున్నా. అప్పుడు అమ్మ అన్ని చిరునవ్వుల వెనుక కొంచెం ఆందోళన చెందుతున్నట్లు నాకిప్పుడు అర్థమైంది.. ఆమె మా బాల్యంలో కురిపించిన ఆనందం, ప్రేమ, వెలుగు అంతా మేము అస్వాదించామని' పోస్ట్ చేసింది.
కానీ ఇప్పుడు నేను అమ్మ స్థానంలో ఉన్న వ్యక్తినని.. అది ఒక అందమైన అనుభవమని గ్రహించానని అనసూయ రాసుకొచ్చింది. ప్రతి ఇంట్లోని మహిళలకు అపారమైన గౌరవం మన పండుగలను జ్ఞాపకాలుగా మార్చిందని వెల్లడించింది. ఈ రోజు.. నేను అలసిపోయినా చాలా సంతృప్తిగా ఉన్నా.. నా చిన్ననాటి దీపావళిని మిస్ అవుతున్నా. కానీ ఏదో ఒక రోజు.. నా పిల్లలు ఈ దీపావళిని తిరిగి చూసుకుని.. నాలాగే అదే రకమైన ఫీలింగ్‌ను అనుభవిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ దీపాల కాంతి అందరి జీవితాల్లో చాలా కాలం పాటు నిలిచి ఉండాలని, ప్రేమ, ఆనందంతో నిండిన మీ అందరికీ, మీ ప్రియమైన వారికి సంతోషకరమైన, ప్రకాశవంతమైన, సురక్షితమైన దీపావళి శుభాకాంక్షలు అంటూ అనసూయ విషెస్ తెలిపింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.