రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను అలరించాయి. ఈ సినిమాలతో తెలుగు ఖ్యాతిని విశ్వవాప్తం చేశాడు మన దర్శకధీరుడు. ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో వచ్చిన బాహుబలి-1, బాహుబలి-2 బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ఈ చిత్రాల్లో తమన్నా భాటియా హీరోయిన్గా మెప్పించింది. అయితే బాహుబలి మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ రెండు చిత్రాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరోయిన్ తమన్నా.. బాహుబలి మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమా నాలో ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచిందని గుర్తు చేసుకుంది. ఈ ప్రాంచైజీలో నటించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. ఒక సినిమాకు మెరుగులు దిద్దేందుకు వీఎఫ్ఎక్స్ను ఎలా ఉపయోగిస్తారో నేర్చుకున్నానని పేర్కొంది.
తమన్నా మాట్లాడుతూ.. 'నా కెరీర్లో ఎక్కువగా నేర్చుకున్న సినిమా బాహుబలి. ఈ మూవీ షూటింగ్లో చాలా విషయాలు ఊహించుకోవాల్సి వచ్చింది. అందువల్ల వీఎఫ్ఎక్స్ను ఎలా ఉపయోగిస్తారో చాలా నేర్చుకున్నా. ఇది నాకు ప్రయోగాత్మకంగా ఉండేందుకు అత్మవిశ్వాసాన్నిచ్చింది. అప్పటి నుంచి ప్రజల అభిప్రాయాలను సీరియస్గా తీసుకోవడం మానేశా. నన్ను నేను చాలా ఎక్కువగా విశ్వసించడం ప్రారంభించా. ఇది నాపై నాకున్న నమ్మకాన్ని మరింత పెంచిందని' తెలిపింది. కాగా..తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది.


