టాలీవుడ్ నటి రేణు దేశాయ్(Renu desai) ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. సినిమాల్లో నటించకపోయినా కూడా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. దైవ భక్తి ఎక్కువగా ఉన్న రేణు దేశాయ్ కాస్తా గ్యాప్ దొరికితే ఆధ్యాత్మిక పర్యటనలతో బిజీగా ఉంటోంది.
తాజాగా సోషల్ మీడియాలో తన ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ రోజు కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరకూడదు.. మనమే రక్షకుడిగా మారాలని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కాల భైరవుడు మీతో పాటు నడుస్తూ శాంతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడని రేణు దేశాయ్ రాసుకొచ్చింది. ఆ పరమశివుడు పిలిచిప్పుడు మీరు అన్ని వదిలేసి కాశీ వెళ్తారని తెలిపింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.


