హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తెలుగమ్మాయి వితికా షేరు. ఆ తర్వాత హీరో వరుణ్ సందేశ్ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. ఈ ఏడాది తన సొంతింటి కలను కూడా నేరవేర్చుకుంది. తన భర్త బర్త్డేకు స్పెషల్ గిఫ్ట్గా ఇచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలను అభిమానులను పంంచుకుంది. అయితే ఇటీవలే తన సిస్టర్ సీమంతం వేడుకను గ్రాండ్గా నిర్వహించింది. అక్కగా తన చెల్లి కృతిక సీమంతాన్ని దగ్గరుండి జరిపించింది. అత్తగారింట్లో జరిగిన ఈ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా మరోసారి చెల్లి కృతిక సీమంతాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. మెట్టినింటి తర్వాత పుట్టింట జరిగిన సీమంతం వేడుకలో వితికా షేరు తన చెల్లికి జీవితంలో మరిచిపోలేని ప్రదర్శన ఇచ్చింది. ఈ వేడుకలో వితికా ప్రత్యేకమైన పాటతో అలరించింది. తన ప్రదర్శనతో ఈ సీమంతం వేడుకను మరింత స్పెషల్గా మార్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ అక్క అంటే నీలా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. ఒక అక్కగా నా కళ్లలో నీళ్లు వచ్చేలా చేశారు వితికా గారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏ చెల్లికైనా ఇలాంటి అక్క ఒక్కరూ ఉంటే చాలని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. చెల్లి కృతికని చంటిపాపలా చూసుకునే వితికా షేరు.. ఆమె పెళ్లిని తన చేతుల మీదుగానే చేసింది. 2022లో కృతిక, కృష్ణ అనే వ్యక్తిని వివాహమాడింది. కొన్ని నెలల క్రితమే కృతిక.. తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను సైతం షేర్ చేసింది. ఇప్పుడు సీమంతం కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది.


