నన్ను సూపర్ స్టార్‌గా నిలబెట్టిన సినిమా ఇదే: విజయశాంతి | Vijayashanthi Celebrates 40 Years of Pratighatana | The Film That Made Her a Superstar | Sakshi
Sakshi News home page

Vijayashanti: 40 ఏళ్ల నాటి సినిమాను గుర్తు చేసుకున్న రాములమ్మ

Oct 12 2025 12:17 PM | Updated on Oct 12 2025 12:30 PM

Tollywood actress Vijayashanti remembners her Super hit Movie

ఈ ఏడాది అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో ప్రేక్షకులను అలరించిన ‍సీనియర్ హీరోయిన్ విజయశాంతి. కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అభిమానులను మరోసారి ఆకట్టుకుంది. విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రానికి ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించారు. ‍అయితే 1990ల్లో విజయశాంతి స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ పలు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న విజయశాంతి తాను నటించిన మూవీని గుర్తు చేసుకుంది. తన కెరీర్‌లోనే సూపర్ స్టార్‌గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన చిత్రమని ట్విటర్‌లో పోస్ట్ చేసింది.


1985 ‍‍అక్టోబర్‌ 11న తాను నటించిన ప్రతిఘటన మూవీలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ‍అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఈ దుర్యోధన దుశ్శాసన పాటను అందించిన శ్రీ వేటూరి గారికి, ఈ పాట పాడిన ఎస్ జానకి అమ్మకు, మాటల రచయిత ఎంవీఎస్‌ హరనాథ్ రావు గారికి.. విశేషంగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చింది. ప్రతిఘటన సినిమా తర్వాత లేడీ సూపర్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ ప్రజల నుంచే వచ్చిందని గతంలోనే విజయశాంతి వెల్లడించింది. అలాగే లేడీ జాకీ చాన్, లేడీ అమితాబ్‌ అని కూడా తనను పిలిచేవారని గత ఇంటర్వ్యూలో పేర్కొంది.  కాగా.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా విజయశాంతి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement