
టాలీవుడ్ హీరో మంచు మనజ్ ఇటీవలే మిరాయ్ మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో విలన్‌గా అభిమానులను అలరించారు. హనుమాన్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ ఏడాది గట్టిగా కమ్ బ్యాక్ ఇచ్చాడు మంచు మనోజ్. భైరవం తర్వాత మిరాయ్ మూవీతో ఆకట్టుకున్నారు.
ఇదిలా ఉంచితే మంచు మనోజ్ 2023లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. తాజాగా అక్టోబర్ 4న తన సతీమణి మౌనిక పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు మంచు మనోజ్. ఈ సందర్భంగా తన భార్యపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన భూమా మౌనిక.. ఆది పరాశక్తి అంటే నువ్వే. నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి పూర్తిగా మారిపోయింది. టెన్షన్లో ఉన్నప్పుడు నీ మౌనం, కష్టాల్లో కూడా నీ దయ, ప్రజల పట్ల, నిన్ను బాధపెట్టే వారి పట్ల కూడా నీ అచంచలమైన కరుణ మాయాజాలాన్ని నేను చూశాను. ఆ బలం, స్వచ్ఛత నన్ను విస్మయంతో తల వంచేలా చేస్తాయి ఎప్పటికీ. నా భార్యగా ప్రేమను పంచావు. ధైరవ్, దేవసేన.. లిటిల్ జోయాకు తల్లిగా.. నువ్వు వారి ప్రతి అడుగును నడిపించే వెలుగుగా మారావ్. మా ఇంటిని నవ్వులతో నింపేశావ్. నమస్తే వరల్డ్ సీఈవో, వ్యవస్థాపకురాలిగా ఏమి సాధించగలదో నువ్వు చూపించావు. రాయలసీమ బిడ్డగా.. ప్రజలకు నీ నిరంతర సేవ నిన్ను నాయకురాలిగా మాత్రమే కాకుండా లెక్కలేనన్ని జీవితాలకు ప్రేరణగా నిలుస్తుందని' కొనియాడారు.
నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ దురాశ పడలేదు.. ఎప్పుడూ నీ కష్టాన్ని నమ్ముకున్నావు.. నీ ఆత్మగౌరవం నన్ను నేను మరింత గౌరవించుకునేలా చేసిందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. నీ వల్లే నేను ఈ రోజు మెరుగైన వ్యక్తిగా మారాను.. నాపై అలాగే రాబోయే మన అందమైన ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. నీ సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.. నీ ధైర్యం నాకు స్ఫూర్తినిస్తూనే ఉందంటూ మనోజ్ రాసుకొచ్చాడు. నా జీవితాన్నే మార్చేసిన నా ప్రేమ, నా భాగస్వామి, నా బలం, నా శక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ వల్లే ఈ ప్రపంచం, పిల్లలు నా లైఫ్లో దక్కిన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు.
Dear @BhumaMounika thalli,
You are the very meaning of Adhi Parashakti. From the day you entered my life, I have seen the magic of your silence in chaos, your grace even in hardship, and your unshakable compassion for people, even those who hurt you. That strength and purity… pic.twitter.com/LgjNwgCENv— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 4, 2025