టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె వల్లే తనకు లక్ కలిసొచ్చిందని అన్నారు. పవిత్రా లోకేశ్ తన లక్కీ ఛార్మ్ అంటూ ప్రశంసలు కురిపించారు. నా లైఫ్‌లోకి ఆమె వచ్చాకే సక్సెస్ మొదలైందని నరేశ్ ఆనందం వ్యక్తం చేశారు. శుభకృత నామ సంవత్సరం మూవీ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌లో నరేశ్ మాట్లాడారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అనంతరం పవిత్రా లోకేశ్ కూడా మాట్లాడారు. నరేశ్‌పై ప్రశంసలు కురిపించారు. దాదాపు 54 ఏళ్ల కెరీర్ ఆయనది.. ఇలాంటి గొప్ప వ్యక్తితో నేను జీవించడం అనేది నా అదృష్టమని పవిత్రా ఆనందం వ్యక్తం చేసింది. ఆయనతో మాట్లాడేందుకు నాకు కేవలం 30 నిమిషాలు మాత్రమే సమయం దొరుకుతుందని.. అంతా ఫుల్ బిజీగా ఉంటారని తెలిపింది. ఈ సినిమాలో అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. కన్నడ నిర్మాత తెలుగులో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగులోనూ నన్ను అభిమాస్తున్నారని.. కానీ అమ్మ భాషపై నాకు మమకారం ఎక్కువని తెలిపింది. నరేశ్ వల్లే నేను తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నాని పవిత్రా లోకేశ్ వెల్లడించింది.
కాగా.. శుభకృత నామ సంవత్సరం మూవీలో నరేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ధనుంజయ, ప్రకృతి జంటగా నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వం వహించారు. డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మించిన ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నారు. ఈ మూవీకి సుధా శ్రీనివాస్ సంగీతమందించారు.
#PavitraLokesh :
నరేష్ గారి లాంటి నటుడితో లివింగ్ నా అదృష్టం,ఆయన రోజుకి 30 నిమిషాలే టైమ్ ఇస్తారు,May U have wonderful life with me 😊#ShubhakruthNamaSamvatsaram#VKNaresh pic.twitter.com/RXdlZntirV— Taraq(Tarak Ram) (@tarakviews) January 19, 2026


