తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ధన్య బాలకృష్ణన్ (Dhanya Balakrishnan). హీరోయిన్‌గా మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు డిఫరెంట్ రోల్స్‌తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం ధన్య హీరోయిన్‌గా కృష్ణ లీల అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవన్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన ధన్య బాలకృష్ణన్ తన కెరీర్, అవకాశాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తన కెరీర్ ప్రారంభంలో చాలా ఫీలయ్యేదాన్ని ధన్య బాలకృష్ణన్ తెలిపింది. నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని పేర్కొంది. గ్లామరస్ రోల్స్‌కు నేను పెట్టుకున్న నిబంధనలే కారణమని తెలిపింది. ఇంటిమేట్ సీన్స్ చేయాల్సిన రోల్స్ ఉంటే కూడా నో చెప్పేదాన్ని అని వెల్లడించింది. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానంటే చాలా గర్వంగా ఉందన్నారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ నాకు హీరోయిన్ ఛాన్సులు వచ్చాయంటే నా సక్సెస్ కారణమన్నారు. నా ఫ్యామిలీని ఒప్పించి మరి ఇండస్ట్రీలోకి వచ్చానని ధన్య బాలకృష్ణన్ వెల్లడించారు.
కాగా.. ధన్య బాలకృష్ణన్ తాజాగా నటించిన చిత్రం కృష్ణ లీల. దేవన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తిరిగొచ్చిన కాలం.. అనేది ఈ మూవీకి ట్యాగ్‌లైన్. ఈ సినిమాను మహాసేన్ విజువల్స్ బ్యానర్‌లో జ్యోత్స్న నిర్మిస్తున్నారు.


