
హీరోయిన్ రేణు దేశాయ్ తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సమయంలో అందరూ పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆకాంక్షించింది. అదే సమయంలో ప్రజలకు ఓ చిన్న విజ్ఞప్తి చేసింది. దయచేసి రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువ శబ్దం వచ్చే క్రాకర్స్‌ను పేల్చవద్దని కోరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇది అందరూ సంతోషంగా పండుగ జరుపుకునే సమయమని నాకు కూడా తెలుసు. కానీ రాత్రి 9 గంటల తర్వాత చాలా ఎక్కువుగా శబ్ధం వచ్చే క్రాకర్లు పేల్చకండి. ఎందుకంటే చాలా మంది వృద్ధులు, చిన్న పిల్లలు నిజంగా ఆ విపరీతమైన శబ్దాలకు ప్రభావితమవుతారు. ఈ సమయంలో మీరు చాలా మెరుపులు, పూల కుండలు, చక్రాలతో ఆనందించండి. ఎక్కువ శబ్దం చేయకుండా కేవలం లైటింగ్‌తో పండుగను మరింత ఆనందంగా జరుపుకోండి' అంటూ విజ్ఞప్తి చేసింది.
కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్‌లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది.