ఇటీవల కొద్దికాలంగా మృణాల్ ఠాకూర్ పెళ్లి రూమర్స్ తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలా సార్లు వీరిద్దరు ఈవెంట్స్‌లో కనిపించడంతో త్వరలోనే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని వార్తలొచ్చాయి. వచ్చేనెల ఫిబ్రవరిలోనే వీరి పెళ్లి అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వీటిపై ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు.
అయితే తనపై పెళ్లి రూమర్స్ వస్తున్న వేళ సీతారామం బ్యూటీ ఫుల్‌గా చిల్ అవుతోంది. వీటిని అస్సలు పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె సన్నిహితుల్లో ప్రస్తుతం ఆమైపై వస్తున్న పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఇలాంటి సమయంలో ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మృణాల్ సముద్రంలో విహరిస్తూ చిల్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. గతేడాది మృణాల్, ధనుశ్‌లపై ఆగస్టు 2025లో మొదటిసారి డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ఆ సమయంలో చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌లో వారిద్దరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అది కాస్తా నెట్టింట వైరల్ కావడం.. అంతకు ముందు, మృణాల్ ధనుశ్ ప్రాజెక్ట్ 'తేరే ఇష్క్ మే' ముగింపు పార్టీలో కనిపించడంతో వీరిద్దరి రిలేషన్‌పై ఊహగానాలు మొదలయ్యాయి.


