సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. పోస్టర్‌తోనే విపరీతంగా ట్రోల్స్..! | Sai Pallavi Bollywood Debut Movie Ek Din Poster Gets Remake Allegations, Know Reasons Inside | Sakshi
Sakshi News home page

Sai Pallavi: సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. పోస్టర్‌పై పెద్దఎత్తున విమర్శలు..!

Jan 16 2026 9:13 AM | Updated on Jan 16 2026 10:37 AM

Sai Pallavi Bollywood Debut Movie Ek din Poster Gets copy trolls

భామ.. తమిళం, మలయాళంలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన సాయిపల్లవి.. రామాయణతో పాటు ఏక్‌ దిన్‌ అనే మూవీలో కనిపించనుంది. ఈ సినిమాలో అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు.  ఈ సినిమాతోనే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

తాజాగా సంక్రాంతి కానుకగా ఏక్‌ దిన్‌ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఏక్ దిన్ మూవీ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అయితే ఈ పోస్టర్ కాస్తా విమర్శలకు దారి తీసింది. ఇది చూస్తుంటే 2016లో వచ్చిన థాయ్‌ రొమాంటిక్‌ డ్రామా వన్‌ డేను పోలి ఉందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఆ మూవీని కాపీ చేశారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

పేరుతో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వరకూ అన్నీ ఒకేలా ఉన్నాయంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి ఈ చిత్రం రీమేక్‌ చేయనున్నారా? లేదా కొత్త స్టోరీనా అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే కాపీ కంటెంట్‌ అనే విమర్శలొస్తూనే ఉంటాయి. ఈ మూవీని ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు. సునీల్‌ పాండే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో మే 1న రిలీజ్ చేయనున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement