బలగం మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తన రెండో సినిమా టైటిల్‌ను ప్రకటించిన వేణు.. హీరోను కూడా పరిచయం చేశారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌ను హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే ఎల్లమ్మ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా టాలీవుడ్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సినిమాతోనే సంగీత దర్శకుడు డీఎస్పీ హీరోగా అరంగేట్రం చేయనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో వేణు మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవీశ్రీ ప్రసాద్‌కు హీరోగా మొదటి సినిమా కావడంతో కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథపై ఏకంగా 8 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది.
తాజాగా డైరెక్టర్ వేణు యెల్దండి తన ట్వీట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. డీఎస్పీతో ఫస్ట్ మీటింగ్.. ఇది 8 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చ అంటూ పోస్ట్ చేశారు. ఎల్లమ్మ కథపై వీరిద్దరి మధ్య ఏకంగా 8 గంటల పాటు చర్చ సాగిందని దర్శకుడే స్వయంగా వెల్లడించారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ సినీ వర్గాల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇదంతా చూస్తుంటే ఈ సినిమాపై వీరిద్దరు ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. ఈ చిత్రంలో డీఎస్పీ పర్శీ అనే పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తన సినిమాకు డీఎస్పీనే సంగీతం అందిస్తున్నారు.
The first meeting with @ThisIsDSP Sir….
it was 8hours long discussion👌🤗🥰🙏
🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼#YellammaGlimpse #Yellamma pic.twitter.com/K7S1VH5g2W— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) January 19, 2026


