ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌లో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా అభిమానుల అంచనాల మధ్య క్రిస్‌మస్ కానుకగా 25న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ.3.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో ఆది సాయికుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మరిన్ని థియేటర్స్ యాడ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తిక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతమందించారు.
Thanks for your love and support plz do watch #Shambhala in Theatres 🙏❤️ pic.twitter.com/NPe07O79Us
— Aadi Saikumar (@iamaadisaikumar) December 26, 2025


