రణధీర్ భీసు హీరోగా నటిస్తోన్న చిత్రం మిరాకిల్. ఈ మూవీలో హెబ్బా పటేల్, ఆకాంక్ష హీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని సైదా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మంట్ బ్యానర్‌పై రమేష్ ఏగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఈనెల 16న ఫస్ట్ లుక్ రివీల్ చేస్తామని వెల్లడించారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో నరేష్ నాయుడు, జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము) బెజవాడ మస్తాన్, ధీరజ అప్పాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


