యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం డ్రాగన్(రూమర్ టైటిల్). టైటిల్ ఇంకా ఖరారు చేయనప్పటికీ ఈ పేరే ఫైనల్ కావొచ్చని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఓ షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.
కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ధృవీకరించారు. ఈ మూవీలో కీలక పాత్రలో పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. డ్రాగన్ పోస్టర్‌ను పంచుకున్న ఆయన.. మరో రెండు లైనప్‌లో ఉన్నాయని తెలిపారు. అయితే అనిల్ కపూర్ ఏ పాత్రలో కనిపిస్తారన్న దానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. డ్రాగన్‌లో ఆసక్తికర రోల్‌లో మెప్పించనున్నారని అర్థమవుతోంది.
కాగా.. జూనియక్ ఎన్టీఆర్‌తో అనిల్ కపూర్ నటిస్తోన్న రెండో చిత్రం కావడం విశేషం. గతంలో వీరిద్దరూ వార్-2లో నటించారు. సందీప్ రెడ్డి వంగా యానిమల్ తర్వాత రెండోసారి దక్షిణాది దర్శకుడితో మూవీలో నటిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది.
One has landed 🐉
The rest two are lining up...#Dragon @AnilKapoor garu via insta story ❤️🔥. #NTRNeel @tarak9999 pic.twitter.com/yWTdgUoFfJ— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) January 16, 2026


