అక్కినేని అఖిల్ హలో.. జున్ను ఇంతలా మారిపోయిందేంటి? | Akkineni Akhil Hello Movie Child artist latest look Goes Viral | Sakshi
Sakshi News home page

Hello Movie: అక్కినేని అఖిల్ హలో.. జున్ను ఇంతలా మారిపోయిందేంటి?

Jan 23 2026 9:43 PM | Updated on Jan 23 2026 9:56 PM

Akkineni Akhil Hello Movie Child artist latest look Goes Viral

అక్కినేని అఖిల్‌ హీరోగా వచ్చిన రెండో చిత్రం హలో. 2017లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఆడియన్స్‌ మనసులను గెలుచుకుంది. ఈ చిత్రానికి విక్రమ్‌ కే కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అఖిల్‌ సరసన కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటించింది. 

‌అయితే ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన పాప ముద్దుముద్దు మాటలతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో జున్ను పాత్రలో అలరించింది. ఈ మూవీ రిలీజై దాదాపు తొమ్మిదేళ్లు పూర్తయింది. అయితే తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ జున్నుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అప్పుడు క్యూట్‌ క్యూట్‌గా ఈ చిన్నారి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈ ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో హలో చిన్నారి ఇంతలా మారిపోయిందా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement