అభినవ్ గోమటం లేటేస్ట్ మూవీ.. అమెరికాలో టైటిల్ రివీల్ | Tollywood actor abhinav gomatam Latest Movie title revealed | Sakshi
Sakshi News home page

Abhinav Gomatam: అభినవ్ గోమటం లేటేస్ట్ మూవీ.. అమెరికాలో టైటిల్ రివీల్

Jan 19 2026 7:04 PM | Updated on Jan 19 2026 7:22 PM

Tollywood actor abhinav gomatam Latest Movie title revealed

అభినవ్ గోమఠం, స్వాతి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం  ‘ఆటాడిన పాట’. ఈ సినిమాకు వేణు నక్షత్రం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై అవంతిక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించారు.  అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడు జయంత్ చల్లా తన సతీమణి కవిత చల్లాతో కలిసి సినిమా టైటిల్‌ ఆవిష్కరించగా.. టాలీవుడ్ నిర్మాత, ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్ రావు పూజారి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు హాజరై.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు వేణు నక్షత్రం మాట్లాడుతూ… 'ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జయంత్ చల్లా, నాగేశ్వర్ రావు పూజారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డీసీ మెట్రో ప్రాంత ప్రేక్షకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా మిత్రులు, మాకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రేమతో వందనాలు. ఇలాగే మీ ప్రేమను, ఆశీర్వాదాలను మా మీద కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం' అని అన్నారు.

నిర్మాత అవంతిక  మాట్లాడుతూ… 'మా మీద నమ్మకం ఉంచి అండగా నిలిచిన 'ఆటాడిన పాట' చిత్రం టీమ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమ, ఆదరణే మా ప్రయాణానికి బలం. త్వరలోనే ‘ఆటాడిన పాట’ మీ ముందుకు వచ్చి, మీ హృదయాలను తాకుతుంది. ప్రతి ఒక్కరి నమ్మకాన్నీ ఈ సినిమా నిలబెడుతుంది. సోషియో- ఫ్యాంటసీ కోవలోని ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని' వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement