ఓటీటీకి టాలీవుడ్‌ మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Aadi Saikumar Shambhala Movie Ott Streaming Date announced | Sakshi
Sakshi News home page

Shambhala Movie Ott: ఓటీటీకి శంబాల.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Jan 15 2026 3:20 PM | Updated on Jan 15 2026 3:31 PM

Aadi Saikumar Shambhala Movie Ott Streaming Date announced

ఆది సాయి కుమార్ హీరోగా చేసిన మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ శంబాల. డిసెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ గ్రాండ్ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చాడు. ఇటీవలే జనవరి 9న ఈ మూవీ హిందీలో కూడా విడుదల చేశారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. జనవరి 22 నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్‌ ముని తెరకెక్కించాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ కావడంతో బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకుంది.

శంబాల చిత్రాన్ని మహీధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మించారు. ఇందులో అర్చన అయ్యర్‌ హీరోయిన్‌గా కనిపించింది.ఈ చిత్రంలో స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది.
కథేంటంటే... 

ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అదే రోజు ఆ ఊరికి చెందిన రైతు రాములు(రవి వర్మ) ఆవు నుంచి పాలుకు బదులుగా రక్తం వస్తుంది. దీంతో ఆ ఉల్కని ఊరి ప్రజలంతా బండ భూతం అని బయపడారు. ఆ రాయిని పరీక్షించేందుకు డిల్లీ నుంచి ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్‌(ఆది సాయికుమార్‌) వస్తాడు. చావులోనూ సైన్స్‌ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్‌. అలాంటి వ్యక్తి శంబాలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి. రాములుతో సహా పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి..వాళ్లు చనిపోతుంటారు.

ఇదంతా బండ భూతం వల్లే జరుగుందని సర్పంచ్‌తో సమా ఊరంతా నమ్ముతుంది. విక్రమ్‌ మాత్రం ఆ చావులకు, ఉల్కకు సంబంధం లేదంటాడు. ఆ రాయిని పరీక్షించే క్రమంలో ఓ రహస్యం తెలుస్తుంది. అదేంటి? అసలు శంబాల గ్రామ చరిత్ర ఏంటి? ఆ గ్రామదేవత కథేంటి? ఊర్లో విక్రమ్‌కి తోడుగా నిలిచిన దేవి(అర్చన ఐయ్యర్‌) ఎవరు? వింత చావుల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది తెలియాలంటే శంబాల(Shambhala  Review) చూడాల్సిందే.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement