వచ్చేనెలలో విజయ్‌తో పెళ్లి.. రష్మిక ఏమన్నారంటే? | Rashmika Mandanna Reacts On Marriage rumours with vijay devarakonda | Sakshi
Sakshi News home page

Rashmika: వచ్చేనెలలో విజయ్‌తో పెళ్లి.. రష్మిక ఆసక్తికర సమాధానం..!

Jan 19 2026 6:41 PM | Updated on Jan 19 2026 8:03 PM

Rashmika Mandanna Reacts On Marriage rumours with vijay devarakonda

హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. గతేడాది ది గర్ల్‌ఫ్రెండ్‌తో హిట్‌ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. నాలుగేళ్లుగా ఇలాంటి వింటూనే ఉన్నానని తెలిపింది. జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. దాని కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతానని తెలిపింది. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది.  అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్‌లో ఈ విషయం గురించి మాట్లాడతానని రష్మిక సమాధానం దాటవేసింది.

కాగా.. విజయ్‌ దేవరకొండతో  ఫిబ్రవరి 26న రష్మిక పెళ్లి జరగనుందని నెట్టింట వైరలవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్. గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ దీనిపై కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ‍అలాగే తాజాగా పెళ్లి విషయంలోనూ అదే ఫాలో అవుతూ సర్‌ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement