ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ బాటపట్టారు. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే అట్లీతో జతకట్టిన బన్నీ.. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో మూవీకి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు ఏఏ23 వర్కింగ్ టైటిల్‌ను ప్రకటించింది.
అల్లు అర్జున్.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. తొలిసారి వీరిద్దరు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్‌లో 23వ చిత్రంగా రానుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు.
A Collaboration that will be Eternal in Indian Cinema 🤘🏻🔥💥
Icon Star @alluarjun X @Dir_Lokesh X @MythriOfficial X @anirudhofficial
STRIVE FOR GREATNESS🔥
▶️ https://t.co/AGCi8q89x2
Shoot begins in 2026 💥#AALoki #AA23 #LK7 pic.twitter.com/op2vnureqp— Mythri Movie Makers (@MythriOfficial) January 14, 2026


