మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంటోంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
అయితే ఈ చిత్రంలో అబ్బాయిగా నటించి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది చిన్నారి గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరీ బుజ్జాయి అంటూ తెగ వెతికేస్తున్నారు. ఆమె చిన్నారి పేరు ఊహ కాగా.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన బుజ్జితల్లి ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. సినిమాలపై ఇష్టంతో ఇప్పటికే 20కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా విడుదలైన మన శంకరవరప్రసాద్ గారులో చిరంజీవికి కుమారుడిగా నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ తెగ మురిసిపోతోంది. షూటింగ్ సెట్‌లో చిరంజీవి తనను ఎంత ప్రేమగా చూసుకునేవారని అంటోంది.


