నవీన్ చంద్ర సైకలాజికల్ థ్రిల్లర్‌.. భయపెడుతోన్న టీజర్ | NAVEEN CHANDRA Latest Movie HONEY TEASER out now | Sakshi
Sakshi News home page

HONEY TEASER: నవీన్ చంద్ర సైకలాజికల్ థ్రిల్లర్‌.. భయపెడుతోన్న టీజర్

Jan 20 2026 8:30 PM | Updated on Jan 20 2026 8:32 PM

NAVEEN CHANDRA Latest Movie HONEY TEASER out now

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర హీరోగా వస్తోన్న  సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ హనీ. ఈ చిత్రంలో దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల,  ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

హనీ టీజర్ చూస్తుంటే క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అనే ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు.  కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి అజయ్ అరసాడ సంగీతం అందించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement