టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. నేను ఎవరో కూడా తెలియని సమయంలో తరుణ్ నా కోసం నిలబడ్డాడని కొనియాడారు. తరుణ్ భాస్కర్ నటించిన ఓ శాంతి శాంతి శాంతిః మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ఈ కామెంట్స్ చేశారు.
తరుణ్ నాకు పరిచయం లేకపోయినా కూడా నాకోసం నిలబడ్డారని విశ్వక్ సేన్ అన్నారు. నాకు ఫోన్ చేయగానే ఈవెంట్‌కు వచ్చానని తెలిపారు. ఈరోజు నన్ను గెస్ట్ అని అంటున్నారని.. ఎందుకంటే ఇది నా కుటుంబ ఫంక్షన్ అని అన్నారు. కాగా.. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ఓ శాంతి శాంతి శాంతిః. మలయాళంలో తెరకెక్కించిన జయ జయ జయహే మూవీకి రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.


