హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ర్యాపిడో డ్రైవర్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు..
బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని ఇబ్రహీంనగర్‌లో నివాసం ఉండే ర్యాపిడో డ్రైవర్ మొహ్మమ్మద్ జునైద్ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించాడు. అతని వద్ద నుంచి 137 గ్రాముల డ్రై గంజాయి, హోండా షైన్ ద్విచక్ర వాహనం, ఒప్పో మొబైల్ ఫోన్‌ను స్వాదీనం చేసుకున్నారు. నిందితుడు జునైద్‌ను అరెస్టు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


