కర్నూలు బస్సు ప్రమాదం.. ఆ ఇద్దరిపై కేసు నమోదు | Kurnool Bus Accident: Cases Registered Against Driver And Owner | Sakshi
Sakshi News home page

కర్నూలు బస్సు ప్రమాదం.. ఆ ఇద్దరిపై కేసు నమోదు

Oct 26 2025 10:40 AM | Updated on Oct 26 2025 12:09 PM

Kurnool Bus Accident: Cases Registered Against Driver And Owner

కర్నూలు జిల్లా: చిన్న టేకూరు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందికొండ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏ1గా వి కావేరి ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌, ఏ2గా వి కావేరి ట్రావెల్స్‌ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన ప్రయాణికుడు రమేష్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. డ్రైవర్‌తో పాటు యజమానిపై రెండు సెక్షన్ల కింద BNS 125(a), 106(1) సెక్షన్లు పోలీసులు నమోదు చేశారు.

కాగా, 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్‌ ఫెయిల్‌ అయినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చి, హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నాడని గుర్తించారు.

మొదట లారీ క్లీనర్‌గా, తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్‌ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్‌ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement