Ind vs Zim: ఆ ముగ్గురిపై వేటు.. దూబేకూ చోటు | IND Vs ZIM: India Won Toss Opt To Bat First, Yashasvi, Sanju And Dube In Playing XI | Sakshi
Sakshi News home page

Ind vs Zim: ఆ ముగ్గురిపై వేటు.. దూబేకూ చోటు

Jul 10 2024 4:13 PM | Updated on Jul 10 2024 5:11 PM

Ind Vs Zim India Won Toss Opt To Bat Playing XI Yashasvi Sanju Dube In

జింబాబ్వేతో మూడో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్‌-2024 విజేత జట్టులోని ముగ్గురు స్టార్లు పునరాగమనం చేశారు.

ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌, పవర్‌ హిట్టర్‌ శివం దూబే తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి రాకతో సాయి సుదర్శన్‌, ధ్రువ్‌ జురెల్‌లపై వేటు పడింది.

అదే విధంగా.. పేసర్‌ ముకేశ్‌ కుమార్‌కు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో టాస్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ.. వరల్డ్‌కప్‌ విన్నర్ల రాకతో తమ జట్టు మరింత పటిష్టమైందని పేర్కొన్నాడు.

తుది జట్లు..
భారత్‌: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్

జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్‌), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్‌), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement