IND VS ZIM 5th T20: టాస్‌ ఓడిన టీమిండియా.. తుది జట్టులో విధ్వంసకర వీరుడు | IND Vs ZIM 5th T20: Zimbabwe Won The Toss And Elected To Field First, Here Are Playing XI Of Both Teams | Sakshi
Sakshi News home page

IND Vs ZIM 5th T20: టాస్‌ ఓడిన టీమిండియా.. తుది జట్టులో విధ్వంసకర వీరుడు

Jul 14 2024 4:17 PM | Updated on Jul 14 2024 6:26 PM

IND VS ZIM 5th T20: Zimbabwe Won The Toss And Elected To Field First, Here Are Playing XI

హరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్‌ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఖలీల్‌ అహ్మద్‌, రుతురాజ్‌ స్థానం‍లో ముకేశ్‌ కుమార్‌, రియాన్‌ పరాగ్‌ తుది జట్టులోకి వచ్చారు. 

మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్‌ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్‌ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.

తుది జట్లు..
జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్‌), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్‌), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ

టీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్‌), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్
 

Advertisement
 
Advertisement
Advertisement