టీమిండియాపై జింబాబ్వే టెయిలండర్ల కొత్త చరిత్ర! | Sakshi
Sakshi News home page

ZIM vs IND: టీమిండియాపై జింబాబ్వే టెయిలండర్ల కొత్త చరిత్ర!

Published Thu, Aug 18 2022 4:15 PM

Zimbabwes highest 9th wicket partnership against India - Sakshi

హరారే వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో జింబాబ్వే బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 44. 3 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపక్‌ చహర్‌, ప్రసిధ్‌ కృష్ణ అక్షర్‌ పటేల్‌ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్‌ సిరాజ్ ఒక్క వికెట్‌ సాధించాడు.

కాగా ఒక దశలో జింబాబ్వే స్కోర్‌ 150 పరుగుల మార్క్‌ను దాటడం కష్టమనుకున్న సమయంలో టెయిలండర్‌లు రిచర్డ్‌ నగరవా(34), బ్రాడ్‌ ఎవన్స్‌(33) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 70 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా టీమిండియాపై వీరిద్దరూ సరికొత్త రికార్డును నమోదు చేశారు. వన్డేల్లో భారత్‌పై తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జింబాబ్వే జోడిగా నిలిచారు.


చదవండిIND vs ZIM ODI Series: సిరాజ్‌ గొప్ప బౌలర్‌.. అతడి బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు సాధిస్తే: జింబాబ్వే బ్యాటర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement