Zimbabwe vs India ODI series: చహర్‌ పునరాగమనం | Zimbabwe vs India ODI series: Deepak Chahar and Washington Sundar make comeback | Sakshi
Sakshi News home page

Zimbabwe vs India ODI series: చహర్‌ పునరాగమనం

Jul 31 2022 5:57 AM | Updated on Jul 31 2022 5:57 AM

Zimbabwe vs India ODI series: Deepak Chahar and Washington Sundar make comeback - Sakshi

ముంబై: జింబాబ్వే గడ్డపై జరిగే 3 వన్డేల సిరీస్‌ కోసం భారత టీమ్‌ను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ శనివారం ప్రకటించింది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. గాయాల కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన దీపక్‌ చహర్, వాషింగ్టన్‌ సుందర్‌ కోలుకొని పునరాగమనం చేయగా, రాహుల్‌ త్రిపాఠిని తొలిసారి వన్డేలకు ఎంపిక చేశారు.

రోహిత్, కోహ్లి, పంత్, షమీ, బుమ్రా, హార్దిక్‌ ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకోగా... రొటేషన్‌ పాలసీలో భాగంగా ఇతర కీలక ఆటగాళ్లు శ్రేయస్, సూర్యకుమార్, జడేజా, చహల్, అర్‌‡్షదీప్‌లను కూడా ఈ టూర్‌కు పంపరాదని సెలక్టర్లు నిర్ణయించారు. కరోనా బారిన పడిన కేఎల్‌ రాహుల్‌ కోలుకోకపోవడంతో ఎంపిక చేయలేదు.    

జట్టు వివరాలు: శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శుబ్‌మన్‌ గిల్, హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్, సామ్సన్, సుందర్, శార్దుల్, అక్షర్, కుల్దీప్, అవేశ్, ప్రసిధ్, సిరాజ్,  దీపక్‌ చహర్‌. 

Advertisement
 
Advertisement
Advertisement