IND vs ZIM: 'విండీస్‌ సిరీస్‌లో అతడు అదరగొట్టాడు.. అయినప్పటికీ ఓపెనర్‌గా నో ఛాన్స్‌'

Shubman Gill Might Play At 3 In The ODI Series - Sakshi

ఆసియా కప్‌-2022కు ముందు టీమిండియా జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జింబాబ్వే చేరుకున్న భారత జట్టు.. ఆగస్టు 18న తొలి వన్డే ఆడేందుకు సన్నద్ధమవుతోంది. కాగా ఈ పర్యటనలో సీనియర్‌ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వడంతో.. భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ జట్టుకు కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించనున్నాడు.

కాగా ఈ సిరీస్‌కు తొలుత వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినప్పటికీ.. రాహుల్‌ ఫిట్‌నెస్‌ సాధించడంతో తిరిగి అతడినే సారధిగా బీసీసీఐ నియమించింది. రాహుల్‌ తిరిగి జట్టులోకి రావడంతో ధావన్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఈ క్రమంలో విండీస్‌ పర్యటనలో అద్భుతమైన ప్రదర్శనతో అకట్టుకున్న శుభ్‌మాన్‌ గిల్‌ ఏ స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తాడన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గిల్‌ 205 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో గిల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై భారత మాజీ ఆటగాడు దేవాంగ్ గాంధీ తన అభిప్రాయాలను వెల్లడించాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో గిల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది అని గాంధీ తెలిపాడు.

"శుభ్‌మన్‌ గిల్‌కు రానున్న రోజుల్లో భారత జట్టు మేనేజ్‌మెంట్ మరిన్ని అవకాశాలు ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకుంటే అతడు  వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ భారత ప్రణాళికలలో భాగంగా ఉన్నాడు. గిల్‌ కరేబియన్‌ సిరీస్‌లో అద్భుతంగా రాణించప్పటికీ.. జింబాబ్వేతో వన్డేలలో మాత్రం అతడికి ఓపెనర్‌గా అవకాశం దక్కదు. 

రాహుల్‌ గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. త్వరలో ఆసియా కప్‌ జరగనుండడంతో రాహుల్‌ తన రిథమ్‌ను తిరిగి పొందాలంటే ఈ సిరీస్‌ ఎంతో ముఖ్యం.  కాబట్టి  రాహుల్‌ ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా వచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక గిల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావచ్చు" అని  టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవాంగ్ గాంధీ పేర్కొన్నాడు.
చదవండి: Martin Guptill- Rohit Sharma: రోహిత్‌ రికార్డు బద్దలు కొట్టిన గప్టిల్‌.. మరోసారి అగ్రస్థానంలోకి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top