Virat Kohli: కోహ్లికి మాత్రమే ఇలాంటివి సాధ్యం..

Virat Kohli Expressions Became Viral Vs ZIM Match T20 WC 2022 - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో కింగ్‌ కోహ్లి చిత్ర విచిత్రమైన హావభావాలతో మెరిశాడు. క్యాచ్‌ పట్టినప్పుడు ఒక ఎక్స్‌ప్రెషన్‌.. వికెట్ పడినప్పుడు మరొక ఎక్స్‌ప్రెషన్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి బాగా వైరల్‌ అయింది మాత్రం జింబాబ్వే బ్యాటర్‌ వెస్లీ మాధవరే క్యాచ్‌ పట్టినప్పుడు కోహ్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌.

జింబాబ్వే ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే భువనేశ్వర్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన మాధవరే కోహ్లి స్టన్నింగ్‌ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఈ సమయంలో మోకాళ్లపై కూర్చొని చిరునవ్వుతో కోహ్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ హైలైట్‌ అయింది. కాగా కోహ్లి ఎక్స్‌ప్రెషన్‌పై క్రికెట్‌ అభిమానులు స్పందించారు. ''ఇలాంటివి కోహ్లికి మాత్రమే సాధ్యం.. ఎక్కడి నుంచి తెస్తావు ఈ వింత ఎక్స్‌ప్రెషన్స్‌'' అంటూ ‍కామెంట్‌ చేశారు.

ఇక మ్యాచ్‌లో కోహ్లి 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తరపున లీడింగ్‌ స్కోరర్‌గా కొనసాగుతున్న కోహ్లి ఐదు మ్యాచ్‌లు కలిపి 245 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి.  జింబాబ్వేతో జరిగిన సూపర్‌-12 మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 1రియాన్‌ బర్ల్‌ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. సికందర్‌ రజా 34 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌ 3, మహ్మద్‌ షమీ, హార్దిక్‌ పాండ్యాలు రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్‌ సేన 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్‌ యాదవ్‌ 61 నాటౌట్‌, కేఎల్‌ రాహుల్‌ 51 రాణించారు. 

చదవండి: టి20ల్లో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు

అభిమానంతో రోహిత్‌ వద్దకు.. ఒక్క హగ్‌ అంటూ కన్నీటిపర్యంతం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-11-2022
Nov 07, 2022, 04:18 IST
సిడ్నీ: టి20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక క్రికెటర్‌ దనుష్క గుణతిలక కటకటాల పాలయ్యాడు. ఈ నెల 2న...
07-11-2022
Nov 07, 2022, 04:10 IST
గత ఏడాది టి20 వరల్డ్‌కప్‌లో లీగ్‌ దశలోనే ఇంటికొచ్చిన భారత్‌ ఈసారి టోర్నీలో లీగ్‌ టాపర్‌గా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టీమిండియా...
06-11-2022
Nov 06, 2022, 21:45 IST
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం ముగిసిన సూపర్‌-12 పోటీల్లో టీమిండియా బంగ్లాదేశ్‌పై 71 పరుగుల తేడాతో నెగ్గి...
06-11-2022
Nov 06, 2022, 21:05 IST
జార్వో.. గుర్తున్నాడా. అరె ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది. 2021లో టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు పదే పదే...
06-11-2022
Nov 06, 2022, 19:44 IST
క్రికెట్‌లో కొందరు కొడుతుంటే చూడాలనిపిస్తుంటుంది. తమ కళాత్మక ఆటతీరుతో ఆటకే అందం తెచ్చిన ఆటగాళ్లను చూశాం. ఈ తరంలో కోహ్లి,...
06-11-2022
Nov 06, 2022, 19:04 IST
టి20 ప్రపంచకప్‌లో సూపర్‌-12 దశ ఇవాళ్టితో(నవంబర్‌ 6) ముగిసింది. సూపర్‌-12లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల...
06-11-2022
Nov 06, 2022, 18:04 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12 దశలో ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి...
06-11-2022
Nov 06, 2022, 17:31 IST
టి20 ప్రపంచకప్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. అన్ని దారులు మూసుకుపోయాయన్న దశలో పాకిస్తాన్‌ అనూహ్యంగా సౌతాఫ్రికా,...
06-11-2022
Nov 06, 2022, 17:11 IST
జింబాబ్వేపై ఘన విజయం.. గ్రూప్‌-2 టాపర్‌గా సెమీస్‌కు టీమిండియా టి20 ప్రపంచకప్‌లో టీమిండియా గ్రూప్‌-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. జింబాబ్వేతో జరిగిన...
06-11-2022
Nov 06, 2022, 16:38 IST
టీమిండియా సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌ టి20 క్రికెట్‌లో ఎదురులేకుండా సాగిపోతున్నాడు. దూకుడే మంత్రంగా సాగుతున్న సూర్యను ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు...
06-11-2022
Nov 06, 2022, 15:46 IST
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో ఒకపక్క వరుణుడు ఇబ్బంది పడుతుంటే.. మరోపక్క అంపైర్లు తప్పుడు నిర్ణయాలతో బ్యాటర్లు బలవుతున్నారు....
06-11-2022
Nov 06, 2022, 15:40 IST
ICC Mens T20 World Cup 2022- India vs Zimbabwe: టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌...
06-11-2022
Nov 06, 2022, 14:48 IST
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs Bangladesh: ‘‘ఒక వికెట్‌ నష్టానికి 70 పరుగులతో...
06-11-2022
Nov 06, 2022, 13:10 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 సంచలనాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. టోర్నీ మొదటి మ్యాచ్‌తో (శ్రీలంకపై నమీబియా విజయం) మొదలైన సంచనాల...
06-11-2022
Nov 06, 2022, 12:07 IST
విచారంలో బవుమా.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నెదర్లాండ్స్‌ కెప్టెన్‌
06-11-2022
Nov 06, 2022, 11:53 IST
క్రికెట్‌లో దురదృష్టానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచే అర్హత ఉన్న జట్టు ఏదైనా ఉందంటే, అది సౌతాఫ్రికా జట్టేనని చెప్పాలి. నిత్యం...
06-11-2022
Nov 06, 2022, 10:14 IST
ICC Mens T20 World Cup 2022 - South Africa vs Netherlands: టీ20 ప్రపంచకప్‌​-2022 టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి...
06-11-2022
Nov 06, 2022, 09:36 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2 నుంచి తొలి సెమీస్‌ బెర్త్‌ ఖరారైంది. ఇవాళ (నవంబర్‌ 6) ఉదయం సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్‌ సంచలన...
06-11-2022
Nov 06, 2022, 09:04 IST
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs Bangladesh Updates In Telugu: బంగ్లాదేశ్‌పై గెలిచిన పాకిస్తాన్‌ గ్రూప్‌-2...
06-11-2022
Nov 06, 2022, 08:55 IST
టీ20 వరల్డ్‌కప్‌లో పెను సంచలనం నమోదైంది. హాట్‌ ఫేవరెట్లలో ఒకటైన దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం ఎదురైంది. ఇవాళ (నవంబర్‌ 6)... 

Read also in:
Back to Top