IND vs ZIM: వన్డేల్లో గిల్ అరుదైన ఫీట్‌.. మూడో భారత ఆటగాడిగా!

Shubman Gill has now scored the third most ODI runs for India after eight innings - Sakshi

టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఎనిమిది ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా గిల్‌ రికార్డులకెక్కాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో 33 పరుగులు చేసిన గిల్‌ ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో శ్రేయాస్ అయ్యర్‌(416 పరుగులు), నవజ్యోత్ సింగ్ సిద్ధూ (414) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఇప్పటి వరకు 8 వన్డేలు ఆడిన గిల్‌ 369 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. కాగా గిల్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విండీస్‌తో వన్డేల్లో దుమ్ము రేపిన గిల్‌..జింబాబ్వేపై కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో 82 పరుగులతో అదరగొట్టిన గిల్‌.. రెండో వన్డేలో 33 పరుగులతో రాణించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. జింబాబ్వేపై భారత్‌ 5వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఇక ఇరు జట్లు మధ్య అఖరి వన్డే ఆగస్టు 22న హరారే వేదికగా జరగనుంది.
చదవండిIND vs ZIM: 'ఎందుకు రాహుల్‌ ఓపెనర్‌గా వచ్చావు.. గోల్డెన్‌ ఛాన్స్‌ కోల్పోయావుగా'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top